బేరమాడుతోందట.. పూజా హెగ్డే పిక్ వైరల్
పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. సినీ అప్డేట్లు, పర్సనల్ విషయాలు చెబుతూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో బిజీగా ఉంది. పూజా చేతిలో ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. ఈ మధ్యే పూజా హెగ్డే తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూమర్లు వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో రాబోతోన్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. సిద్దా అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. అతని పక్కన హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపికైనట్టు టాక్ వినిపించింది. కానీ అందులో ఎంత నిజమున్నది అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఆ విషయాలు కాసేపు పక్కన పెడితే.. పూజా హెగ్డే ప్రస్తుతం ఓ ఫోటోను షేర్ చేసింది.

పూజా హెగ్డే తన ఇంట్లో ఇప్పుడు రిలాక్స్ అవుతోంది. తన పెట్‌తొ కలిసి ఆడుకుంటోంది. తన పెట్‌ను పూజా హెగ్డే ఆట పట్టిస్తోంది. దానికి ఇవ్వాల్సిన ఫుడ్‌ను ఇవ్వకుండా దాంతో బేరమాడుతున్నట్టు చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇంటి బాల్కనీ మీద పూజా హెగ్డే కాస్త రిలాక్స్ అవుతున్నట్టుంది. ఈ మధ్యే రాధేశ్యామ్ షూటింగ్ నుంచి పూజా హెగ్డే విరామం తీసుకుంది. రాధేశ్యామ్ జూలైలో, బ్యాచ్‌లర్ సినిమా జూన్‌లో విడుదల కాబోతోన్నాయి.


Click it and Unblock the Notifications











