రొమాన్స్‌లో ఎప్పటికీ ఆయనే కింగ్.. ఆ విషయంలో పోటీ ఎవ్వరూ లేరు.. పూజా హెగ్డే సెన్సేషనల్ కామెంట్స్
ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. మొదటి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. బాలీవుడ్ చెక్కేయడంతో తెలుగు సినీ పరిశ్రమకు దూరమైంది. ఆపై అల్లు అర్జున్ డీజే చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టేసింది. ఇక అక్కడి నుంచి పూజా హెగ్డే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవకాశమే రాలేదు.

గోల్డెన్ హీరోయిన్‌గా..
అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించింది పూజా హెగ్డే. వరుసగా విజయాలు రావడంతో టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారింది. రీసెంట్‌గా అల వైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. తాజాగా పూజా హెగ్డే అభిమానులతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించింది.

రొమాన్స్‌లో ఆయనే కింగ్..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే తాజాగా అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానిమచ్చింది. అందులో షారుఖ్ ఖాన్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన కింగ్ ఆఫ్ రొమాన్స్, ఆయనకు పోటీ ఎవ్వరూ లేరని సమాధానమిచ్చింది.

వారే జీవితం..
తెలుగు అభిమానుల గురించి చెప్పమని అడిగితే.. వారే జీవితమని సమాధానమిచ్చింది. తనను ఇప్పటికీ గోపికమ్మ అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. తన చిన్నతనంలో ఫిజిక్స్, ఇంగ్లీష్, టెక్నీకల్ డ్రాయింగ్ ఇష్టమని తెలిపింది. బుట్టబొమ్మ పాటకు వేసిన స్టెప్పులు క్షణాల్లోనే నేర్చుకున్నానని పేర్కొంది.
Recommended Video

బ్రిల్లియంట్ యాక్టర్..
ఒక్క పదంలో నాని గురించి చెప్పమని అడిగితే.. రెండు పదాల్లో చెబుతానని బ్రిల్లియంట్ యాక్టర్ అని తెలిపింది. పూజా ప్రస్తుతం ప్రభాస్-రాధాకృష్ణ మూవీలో నటిస్తుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోతోన్న చిత్రంలో ఎంపికైనట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











