నా మనసంతా అక్కడే ఉంది.. పూజా హెగ్డే కామెంట్స్
ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. అందులో అన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. రాధేశ్యామ్ చిత్రానికి సంబంధించి పూజా హెగ్డే పార్ట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రభాస్ పూజా హెగ్డే కాంబినేషన్ సీన్స్ అన్నీ కూడా పూర్తి అయినట్టు టాక్. ఇక అఖిల్ బ్యాచ్‌లర్ మూవీ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.
ఆచార్య చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే చిందులు వేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం తెలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న పూజా హెగ్డే.. తన కొత్త సినిమా ఓపెనింగ్‌కు హాజరు కాలేకపోయింది. పూజా హెగ్డే దళపతి విజయ్ సినిమాలో చాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ 65వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు.

సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్నాడు. నేడు జరిగిన పూజా ఈవెంట్‌కు తాను రాకపోవడంపై పూజా హెగ్డే స్పందించింది. తాను వేరే చోట షూటింగ్‌తో బిజీగా ఉండటం మూలానా.. పూజా కార్యక్రమానికి రాలేకపోతోన్నాను. నేను ఇక్కడ ఉన్నా కూడా మనసంతా అక్కడే ఉందంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి తమిళంలో తన సత్తా చాటేందుకు పూజా హెగ్డే రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











