Don't Miss!
- News
ఏపీలో పాదయాత్రలపై డీజీపీ క్లారిటీ-అనుమతులు కావాలంటే..!
- Lifestyle
గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా ముఖ్యం; ఈ పండ్లు మరియు కూరగాయలు తింటే తల్లి బిడ్డ క్షేమం..
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
ఎండకు సేద తీరుతూ స్పైసీ లుక్కిచ్చిన అందాల పూజా
కలిసొచ్చిన కాలంలో కాలక్షేపం మహా సరదాగా ఉంటుంది కదండీ! తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే పరిస్థితి ఇదే. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాతో సినీ గడప తొక్కిన ఈ భామ.. అదే మెగా హీరో అల్లు అర్జున్ సరసన 'దువ్వాడ జగన్నాధం' సినిమాతో కెరీర్ టర్న్ చేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన విజయం ఆమెకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఇక ఇటీవలే మహేష్ బాబు సరసన 'మహర్షి' సినిమాలో నటించి మెప్పు పోందిండటంతో ఈ భామకు డిమాండ్ బాగా పెరిగింది.
ఈ డిమాండ్ ను మరింత పెంచుకునేలా సోషల్ మీడియా లోనూ సెగలు పుట్టించే అందాలతో కవ్విస్తోంది పూజా. గత కొద్ది రోజులుగా హాట్ హాట్ ఫొటోలతో మాయ చేసిన అమ్మడు.. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో అండర్ వాటర్ లో పడుకొని దర్శనమిచ్చింది. ఎండకు సేద తీరుతూ స్పైసీ లుక్‌తో యువ హృదయాలను మత్తెక్కిస్తోంది పూజా. పైగా ఈ పిక్ పై "తుఫాను ముందు ప్రశాంతత. ఈ ఏడాదిలో నేను చేయాల్సిన సినిమాల వర్క్ ను ప్రారంభించే ముందు ఆస్వాదిస్తున్న చివరి ప్రశాంతమైన మునక" అంటూ క్యాప్షన్ ఇచ్చి తన మైమరిపించింది.

పూల బికినీ, పింక్ లిప్స్, ఎర్రగా కందిన బుగ్గలు, కూలింగ్ గ్లాసెస్, కనిపించీ కనిపించని సోయగాలు ఈ పిక్ లో బాగా హైలైట్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ అవుతోంది. ఈ ఫోటోకు వచ్చే లైక్స్ లెక్కేయడమే కష్టం! కామెంట్లు కూడా అంతేలెండి! ఇక పూజా సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది పూజా హెగ్డే. అలాగే అల్లు అర్జున్ హీరోగా రానున్న కొత్త సినిమాలో కూడా పూజనే హీరోయిన్. మరోవైపు బాలీవుడ్‌లో కూడా 'హౌస్ ఫుల్ 4' లో నటిస్తోంది ఈ అందాల సుందరి.