పూజా హెగ్డేతో క్లోజ్‌గా ఆ స్టార్ హీరో... నటుడితో రొమాన్స్ వీడియో లీక్

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ కష్టకాలంలో ఉంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఆమె సినీ జీవితం పడుతూ లేస్తూ సాగుతోంది. దక్షిణాదితో పాటు నార్త్‌లోనూ బుట్టబొమ్మ కెరీర్ ఏమాత్రం సాఫీగా సాగడం లేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ జన నాయగన్, హిందీ మూవీ హాయ్ జవానీతో ఇష్క్ హోనా హైపైనే ఉన్నాయి. ఇవి కాకుండా ప్రస్తుతం కాంచన 4, దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న డీక్యూ 41 సినిమాలలో పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఎంతో కష్టపడి ఆఫర్లు సాధిస్తున్నప్పటికీ రిజల్ట్ మాత్రం తేడా కొడుతోంది.

మోడలింగ్ నుంచి సినీరంగంలో అడుగుపెట్టారు పూజా హెగ్డే. కెరీర్ తొలినాళ్లలో ఆమె నటించిన ఫ్లాప్ కావడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ వచ్చింది. అయితే అవమానాలను భరించి, తన ప్రతిభతోనే లక్ష్యాన్ని అందుకున్నారు పూజా హెగ్డే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. కానీ రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు డిజాస్టర్ కావడంతో పాటు కొన్ని సినిమాల నుంచి ఆమెను తప్పించడంతో పూజాహెగ్డే కెరీర్‌ తలకిందులైంది. ఒకదశలో ఆమె సినీ ప్రస్థానం ముగిసినట్లేనని అందరూ భావించగా.. మళ్లీ అవకాశాలు అందుకున్నారు బుట్టుబొమ్మ.

Pooja Hegde and Varun Dhawan s Viral Video Leak Shocks Hai Jawani Toh Ishq Hona Hai Team

తను ఎన్నో ఆశలు పెట్టుకున్న దళపతి విజయ్ చివరి చిత్రం జన నాయగన్.. వివాదాల్లో చిక్కుకుని రిలీజ్‌కి నోచుకోవడం లేదు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడంతో త్వరలోనే జన నాయగన్ విడుదలకు లైన్ క్లియర్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూన్ 19న ఈ సినిమా విడుదల అవుతుందని నెట్టింట గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. కానీ నిర్మాతలు మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

దీనితో పాటు పూజా హెగ్డే హిందీలో నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై కూడా విడుదలకు సిద్ధమైంది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరో. మృణాల్ ఠాకూర్‌తో పూజా స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారు. వీరితో పాటు మౌనీ రాయ్, మనీష్ పౌల్, జిమ్మి షెర్గిల్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా రమేశ్ తౌరానీ నిర్మిస్తున్నారు. జూన్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

ఇదిలాఉండగా.. చిత్ర పరిశ్రమని ప్రైవసీ రక్కసి పట్టి పీడుస్తుండగా.. దాని కంటే ముందే లీకేజ్‌లు వణికిస్తున్నాయి. ఎంతో కష్టపడి తీసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ పనిచేస్తుంటే కొందరి కారణంగా వందలాది మంది కష్టం వృథా అవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీకులకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ కూడా ఈ లీకుల బారినపడింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో పూజా హెగ్డే- వరుణ్ ధావన్‌లు రొమాన్స్‌లో మునిగి తేలుతుండగా.. ఏదో ఫోటో షూట్ జరుగుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో లీకైనట్లుగా తెలుసుకున్న చిత్ర యూనిట్ వెంటనే యాక్షన్‌లోకి దిగినట్లుగా బీటౌన్ మీడియా చెబుతోంది. అయితే ఈ ఇది సినిమాలోని వీడియోనా? లేక ఏదైనా ప్రమోషనల్ కంటెంటా? అనేది మాత్రం తెలియరాలేదు.

కాగా.. ఈ సినిమాలో పూజా హెగ్డే గ్లామర్ డోస్ పెంచేసినట్లు టీజర్, ట్రైలర్లు చూస్తే అర్ధమవుతోంది. హీరో వరుణ్ ధావన్‌తో బీచ్‌లో రొమాన్స్‌తో పాటు లిప్‌లాక్ సీన్స్‌లో రెచ్చిపోయింది బుట్టబొమ్మ. వీరిద్దరి కెమెస్ట్రీ చూసి వరుణ్- పూజలు డేటింగ్‌లో ఉన్నారంటూ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X