ఆ స్టార్ హీరో అనగానే.. కథ కూడా వినకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బుట్టబొమ్మ..?

సాధారణంగా స్టార్ హీరోయిన్ గా మూడేళ్లు కొనసాగడం అంటేనే ఇప్పుడున్న కాలంలో అతి పెద్ద రికార్డ్. ఎందుకంటే జనరేషన్స్ కి తగ్గట్లుగా హాట్ హీరోయిన్స్ ఎప్పటికప్పుడు పోటీని ఇచ్చే విధంగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక హీరోయిన్స్ కొరత ఉన్న సమయంలో కరెక్ట్ గా హిట్స్ కొట్టిన పూజా హెగ్డే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. జాగ్రత్తగా పెద్ద సినిమాలను మాత్రమే ఎంచుకుంటు తన పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటోంది.

అయితే ఇటీవల పూజా హెగ్డే ఒక స్టార్ హీరోతో సినిమా అనగానే కథ వినకముందే ఒకే చేసిందట. గతంలో చాలా మంది హీరోయిన్స్ అగ్ర హీరోలు అనగానే ఇదే విధంగా నిర్ణయం తీసుకొని ప్లాప్స్ కూడా ఎదుర్కొన్నారు. ఇక పూజ కూడా ఇప్పుడు అలాంటి రిస్క్ చేస్తుందేమో అనే టాక్ వస్తోంది. ఇక ఆ హీరో మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త సినిమాకు హీరోయిన్ గా దాదాపు పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Pooja hegde another big movie with harish shankar directional

పవన్ కళ్యాణ్ సినిమా అనగానే అమ్మడు ఎగిరి గంతేసి కథ కూడా వినకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. పూజా ఆ సినిమాను ఒకే చేయడానికి మరో కారణం కూడా ఉందని చెప్పవచ్చు. ఇదివరకే ఆమె హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన డీజే, గద్దల కొండ గణేష్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు ఆమె కెరీర్ కి బాగానే ఉపయోగపడ్డాయి. అందుకే మరోసారి హరీష్ పై నమ్మకంతో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చని రూమర్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X