బాలీవుడ్ బాక్సాఫీస్ కాంబినేషన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మెల్లగా బాలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకుంటోంది. కెరీర్ మొదట్లో అక్కడ ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్న ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం గ్లామర్ డోస్ పెంచి తన రెమ్యునరేషన్ ని కూడా పెంచేస్తోంది. బాలీవుడ్ స్టైలిష్ హీరో రణ్ వీర్ సింగ్ తో పూజా హెగ్డే ఒక సినిమా చేయనున్నట్లు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఆ సినిమా నుంచి మళ్ళీ తీసేశారని కూడా న్యూస్ రాగా అవన్నీ అబద్దాలని తేలిపోయింది. ఫైనల్ గా సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ తో ఆడియెన్స్ కి మంచి కిక్కిచ్చారు. ఎందుకంటే ఆ సినిమాను తెరకెక్కించబోయేది రోహిత్ శెట్టి. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్న రోహిత్ ఇంతకుముందు రణ్ వీర్ తో చేసిన సింబా కూడా మంచి విజయాన్ని అందుకుంది. సింబా తెలుగు టెంపర్ రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఇక మరోసారి ఈ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సిర్కస్ అనే టైటిల్ సెట్ చేశారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాలో రణ్ వీర్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడట. ఇక మరో ఆలోచన లేకుండా దర్శకుడు పూజా హెగ్డేను మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడంతో మరోసారి బాలీవుడ్ మీడియాలో బట్ట బొమ్మ నేమ్ హాట్ టాపిక్ గా మారింది.
చూస్తుంటే భవిష్యత్తులో వరుస బాలీవుడ్ ఆఫర్స్ తో బిజీ అయ్యేలా ఉందని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ అవకాశంతో పూజ అక్కడి స్టార్ హీరోయిన్స్ కి ఎలాంటి పోటీని ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











