8 ఏళ్ళ తరువాత మరోసారి ఆ యువ హీరోతో పూజా హెగ్డే.. హిట్ రీమేక్ మూవీలో లక్కీ ఛాన్స్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు అగ్రహీరోయిన్ గా గుర్తింపును అందుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. అంతేకాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఈ బ్యూటీకి చాలా అవకాశాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద మరిన్ని విజయాలు అందుకునే విధంగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అయితే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం సృష్టిస్తుందని పూజ గట్టి నమ్మకంతో ఉంది. ఇక ఆ సినిమా తెలుగు తమిళ్ హిందీ లో అలాగే మలయాళం కన్నడ భాషల్లో కూడా విడుదల అవుతోంది కాబట్టి దాదాపు అన్ని భాషల్లోనూ క్రేజ్ అందుకుంటుంది అని చెప్పవచ్చు.

అంతే కాకుండా పూజ హెగ్డే తమిళంలో మరో పెద్ద సినిమాను విడుదలకు సిద్ధం చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేసిన బీస్ట్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాలో కూడా అమ్మడు గ్లామరస్ పాత్రలో కనిపించబోతోంది. పూజ ఆ సినిమాతో సక్సెస్ అందుకొని తమిళంలో కూడా మంచి ఆఫర్లు అందుకోవాలని చూస్తోంది. ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మ పెద్ద హీరోలతో చేసింది లేదు. ఇక బీస్ట్ సినిమా ప్రభావం కారణంగా ఒక తమిళ దర్శకుడు ఈ బ్యూటీకి మంచి ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలో తెలుగు హీరో నటిస్తుండటం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పూజా ఎనిమిదేళ్ల క్రితమే అతనితో ఒక సినిమా కూడా చేసింది. ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ ఎవర్ గ్రీన్ యువ సామ్రాట్ నాగార్జున కొడుకు అక్కినేని నాగ చైతన్య.

pooja hegde another movie with tollywood hero after 8 years

అక్కినేని నాగ చైతన్య తో 2014లో పూజా హెగ్డే ఒక లైలా కోసం అనే సినిమా చేసింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది. కానీ నటిగా మాత్రం పూజా హెగ్డే కు ఒక మంచి గుర్తింపు అయితే అందించింది. అయితే నాగచైతన్యతో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు త్వరలోనే మానాడు సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. దర్శకుడు వెంకట్ ప్రభు హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే ఇక ప్రస్తుతం పూజా హెగ్డే బిజీగా ఉండటం వలన డేట్లు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పిందట. ఎందుకంటే అమ్మడు కొన్ని సినిమాలను త్వరలోనే ఫినిష్ చేయాల్సి ఉంది. అందుకు దర్శకుడు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ కొన్ని సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X