Pooja Hegde: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ కోసం భారీగా రెమ్యునరేషన్?

గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది వరకు ఆమె ఇండస్ట్రీలో వరుస విజయాలతో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే ఈ ఏడాది మాత్రం వరుస అపజయాలు పలకరిస్తున్నాయి. ఇక ఫ్లాప్స్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా పూజ మాత్రం కొంచెం కూడా తన రేంజ్ ను తగ్గించుకోవడం లేదు. ఇక ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ తో కూడా ఈ బ్యూటీ చాలా చలాకీగా మారిపోతోంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఒక బిగ్ బడ్జెట్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆమె కు భారీ స్థాయిలో పారితోషికం కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎలాంటి సినిమా చేసినా..

ఎలాంటి సినిమా చేసినా..

అల వైకుంఠపురములో సినిమా తర్వాత బుట్ట బొమ్మ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న పూజా హెగ్డే అగ్రహీరోలతో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. గత ఏడాది వరకు పూజా అయితే ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ స్థాయిలో విజయాన్ని సాధించాయి. ఇక పారితోషికం విషయంలో కూడా ఆమె స్థాయిలో తెలుగులో ఏ హీరోయిన్ కూడా అందుకోవడం లేదు అనే చెప్పాలి.

 వరుస పరాజయాలతో..

వరుస పరాజయాలతో..

అయితే ఈ ఏడాది కొన్ని వరుస పరాజయాలతో పూజా అయితే కొంత సతమతం అయింది.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ఊహించిన విధంగా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా దాదాపు 100 కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత బీస్ట్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఇక మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

సక్సెస్ ట్రాక్ లోకి వచ్చినట్లే..

సక్సెస్ ట్రాక్ లోకి వచ్చినట్లే..

పూజా హెగ్డే వరుసగా మూడు సినిమాలతో ఇటీవల కాలంలో డిజాస్టర్స్ అందుకుని ఐరన్ లెగ్ గా మారిపోయింది. అయితే మళ్లీ ఆమె F3 సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. వెంకటేశ్ వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్కిన ఆ కామెడీ మల్టీస్టారర్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవడంతో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ కు కూడా మంచి క్రేజ్ వస్తుంది. కాబట్టి బుట్టబొమ్మ మళ్ళీ తన సక్సెస్ ట్రాక్లోకి వచ్చినట్లే అని చెప్పవచ్చు.

 బాలీవుడ్ లో బిగ్ ఆఫర్స్

బాలీవుడ్ లో బిగ్ ఆఫర్స్

ప్రస్తుతం పూజా హెగ్డే అయితే ఒక సినిమా కోసం మూడు కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ తో కూడా ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే మొదలు కాబోయే కభీ ఈద్ కభీ దివాలి సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ గా నటించబోతోంది. అంతేకాకుండా మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

మరో స్పెషల్ సాంగ్ ఆఫర్

మరో స్పెషల్ సాంగ్ ఆఫర్

బాలీవుడ్ లో మరొక బిగ్ బడ్జెట్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు కూడా బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ సినిమాలో పూజా హెగ్డే ఒక ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నట్లు గా తెలుస్తోంది. ఇక ఆ స్పెషల్ సాంగ్ ఆమె ఏకంగా కోటిన్నర వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఈ బ్యూటీకి బాలీవుడ్లో మరింత క్రేజ్ పెరుగుతుంది అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X