Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షూటింగ్ మొదలెట్టేసి ‘బ్యాచ్‌లర్’.. సెట్లో పూజా హెగ్డే పోజులు!!
టాలీవుడ్లో షూటింగ్‌ల సందడి మొదలైంది. ఇప్పటికే చిన్న సినిమాలన్నీ పట్టాలెక్కేశాయి. ఇక మీడియం రేంజ్ చిత్రాలు కూడా సెట్స్ పైకి అడుగుపెట్టేశాయి. దీంతో టాలీవుడ్లో మళ్లీ మునుపటి వాతావరణం కనిపిస్తోంది. ఐదారు నెలల నుంచి ఇంటి పట్టునే ఉంటూ వస్తోన్న మన తారల బయటి ప్రపంచాన్ని చూస్తున్నారు. వారం రోజులు, పది హేను రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న చిత్రాలన్నీ షూటింగ్ పూర్తి చేసేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో నాగ చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ, సాయి ధరమ్ తేజ్ నభ నటేష్ సోలో బ్రతుకే సో బెటర్ సెట్స్ పైకి వెళ్లాయి. ఇందులో సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ కూడా పూర్తైంది. ఇక తాజాగా అఖిల్, పూజా హెగ్డేల మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ షూటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.
అసలే హిట్ కోసం తెగ తాపత్రయ పడుతున్న అఖిల్ ఆశలన్నీ బ్యాచ్‌లర్ చిత్రంపైనే ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ మరి అఖిల్ ఆశలను నేరవేరుస్తాడో లేదో చూడాలి. ఇక బుట్టబొమ్మ నేడు బ్యాచ్‌లర్ సెట్లో అడుగుపెట్టింది. తన క్యారవ్యాన్ వద్ద తన అసిస్టెంట్లతో కలిసి పోజులిచ్చింది. ది బ్యాండ్ జీ్ బ్యాక్ అంటూ బ్యాచ్‌లర్ సెట్‌పై ఉన్నట్టు చెప్పుకొచ్చింది.
మరి ఈ చిత్రం అయినా అఖిల్‌కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక పూజా వరుస హిట్లతో దూసుకుపోతుండటంతో ఈ చిత్రానికి ప్లస్ అయ్యేలానే కనిపిస్తోంది. ఇక అఖిల్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రకటక కూడా ఇచ్చేశాడు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఫిక్స్ చేసుకున్నాడు.