ఎయిర్‌పోర్టులో అలా బుక్కైన బుట్ట బొమ్మ.. పూజా హెగ్డే బ్యాగ్ ఖరీదు తెలిస్తే కళ్లు చెదరాల్సిందే
అందాల భామ పూజా హెగ్డే వరుస విజయాలతో దూసుకెళ్లడమే కాకుండా అగ్ర హీరోలతో జతకడుతూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను దక్కించుకొన్నది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. లాక్‌డౌన్‌లో విశ్రాంతి తీసుకొన్న పూజా హెగ్డే మళ్లీ పనిలో బిజీ అయిపోయారు. ఇటీవల ఆమె ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా చిక్కిన ఫోటోలు వీడియోలు వైరల్‌గా మారాయి. పూజా హెగ్డే చేతిలోని బ్యాగ్ ధర మీడియాలో చర్చనీయాంశమైంది. ధాని ఖరీదు ఎంతంటే..

2019లో పూజా హెగ్డే విజయ యాత్ర
లాక్‌డౌన్‌కు ముందు పూజా హెగ్డే భారీ విజయాలను అందుకొన్నది. 2019 సంవత్సరం పూజాకు బాగా కలిసి వచ్చింది. మహర్షితో ప్రారంభమైన విజయయాత్ర గద్దలకొండ గణేష్, హౌస్‌ఫుల్ 4 వరకు సాగింది. ఇక 2020లో అల వైకుంఠపురం చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకొన్నది.

లాక్‌డౌన్ తర్వాత అఖిల్‌తో
లాక్‌డౌన్ తర్వాత ఇప్పడిప్పుడే షూటింగులు మొదలు కావడంతో అఖిల్‌తో కలిసి నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ షూటింగులో పాల్గొన్నది. ఇటీవల సెట్స్‌లో హడావిడి చేస్తూ దిగిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. అఖిల్‌తో కలిసి నటిస్తున్న సినిమా సెట్స్‌లో ఇద్దరు కలిసిన ఫోటో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.

ముంబై ఎయిర్‌పోర్టులో అలా చిక్కి...
హైదరాబాద్‌లో మోస్ట్ బ్యాచ్‌లర్ షూటింగు ముగించుకొని తిరిగి వెళ్తున్న బుట్టబొమ్మ ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంటికి చిక్కింది. అందంగా నడుచుకొంటూ వస్తున్న ఈ బ్యూటీని కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

పూజా హెగ్డే బ్యాగ్ ఖరీదు ఎంతంటే
ఇక పూజా హెగ్డే చేతిలోని బ్యాగ్ బ్రాండ్, ఖరీదు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. గుచ్చి బ్రాండ్ లెదర్ బెల్ట్ బ్యాగ్‌ను పట్టుకొని ముఖానికి మాస్క్, మెరూన్ రంగు జాకెట్‌తో తెల్లటి ప్యాంట్ ధరించి మీడియా కంటపడింది. అయితే ఆ బ్యాగ్ ఖరీదు సుమారు 90 వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్లలో దాని ఖరీదు 1200 డాలర్లకుపైగానే ఉన్నట్టు ఆన్‌లైన్ బిజినెస్ వెబ్‌సైట్స్ తెలిపాయి.
Recommended Video

అఖిల్, ప్రభాస్‌లతో బుట్ట బొమ్మ
ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా సెట్స్‌పై ఉంది. అలాగే ప్రభాస్‌తో రాధే శ్యామ్ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావొస్తుంది. లాక్‌డౌన్ కారణంగా 2020 రిలీజ్ కావాల్సిన ఈ రెండు చిత్రాలు దాదాపు వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











