బ్రాలెస్ ఫొటోతో రెచ్చిపోయిన పూజా హెగ్డే: తొలిసారి అలాంటి ఫోజుతో షాకిచ్చిన బుట్టబొమ్మ

టాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతోన్న వారిలో బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతలా ఈ అమ్మడు వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. అద్భుతమైన అందంతో పాటు యాక్టింగ్ కూడా పండించగల ఈ బ్యూటీ.. కెరీర్ ఆరంభంలోనే వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ, ఈ మధ్య కాలంలో ఒకదాని తర్వాత ఒకటి ఇలా బోలెడు హిట్లతో దూసుకుపోతోంది. ఫలితంగా స్టార్‌డమ్‌తో పాటు సంపాదననూ పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఓ బ్యాక్‌లెస్ ఫొటోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Pooja Hegde's Emotional Note | ఆమె ఫోన్ కాల్స్ ఇక నాకు రావు అంటూ..!!
 ఫస్ట్ మూవీతోనే.. గోపికమ్మలా ఫేమస్

ఫస్ట్ మూవీతోనే.. గోపికమ్మలా ఫేమస్

చదువు పూర్తయిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది పూజా హెగ్డే. ఆ సమయంలో పలు యాడ్లలో నటించిన ఈ భామ.. కోలీవుడ్ మూవీ 'మూగమూడి'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ వెంటనే తెలుగులో 'ముకుంద', 'ఒక లైలా కోసం' అనే సినిమాలను చేసింది. ఇవి పెద్దగా సక్సెస్ కాకున్నా.. గోపికమ్మగా ఆమె అందరికీ గుర్తుండిపోయే పాత్రను చేసి మెప్పించింది.

ఫ్లాపులు వచ్చినా.. బడా ఆఫర్లతో సత్తా

ఫ్లాపులు వచ్చినా.. బడా ఆఫర్లతో సత్తా

కెరీర్ ఆరంభంలోనే పలు పరాజయాలను అందుకున్న పూజా హెగ్డే.. అందంతో పాటు యాక్టింగ్‌లో మెప్పించింది. తద్వారా ఏకంగా హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా ఫ్లాప్ అయింది. కానీ, ఆమెకు మాత్రం వరుసగా ఆఫర్ల వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరి సరసనా నటించిందీ బ్యూటీ.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. చార్జ్ భారీగా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. చార్జ్ భారీగా

తెలుగు సినీ ఇండస్ట్రీలో సరైన ఆరంభాన్ని అందుకోలేకపోయిన పూజా హెగ్డే... ఆ తర్వాత హిట్ ట్రాక్ ఎక్కింది. ఇలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత 'అరవింద సమేత.. వీరరాఘవ' నుంచి వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో' వంటి విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ కారణంగానే రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసి షాకిస్తోందీ భామ.

చేతి నిండా సినిమాలే.. కోలీవుడ్‌లోనూ

చేతి నిండా సినిమాలే.. కోలీవుడ్‌లోనూ

ప్రస్తుతం పూజా హెగ్డే.. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇది ఎప్పుడో పూర్తైనా.. ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీనితో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఇప్పుడు 'ఆచార్య'తో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది.

కరోనాతో పోరాటం.. బన్నీపై పంచ్ పేల్చి

కరోనాతో పోరాటం.. బన్నీపై పంచ్ పేల్చి

రెండో దశలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ వేవ్‌లో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. అందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఉంది. కొద్ది రోజులు చికిత్స తర్వాత ఆమె నెగెటివ్‌గా తేలింది. ఆమె క్వారంటైన్‌లో ఉన్న సమయంలోనే అల్లు అర్జున్‌కు పాజిటివ్ రావడంతో ఫన్నీ పోస్ట్ పెట్టి షాకిచ్చింది.

 ఎప్పుడూ అందులోనే.. భారీ ఫాలోయింగ్

ఎప్పుడూ అందులోనే.. భారీ ఫాలోయింగ్

వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. పూజా హెగ్డే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన వ్యక్తిగత, సినీ కెరీర్ విషయాలను, విశేషాలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అందాచందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా ఎనలేని క్రేజ్‌ను ఫాలోయింగ్‌ను అందుకుంటోంది.

బ్రాలెస్ ఫొటోతో షాకిచ్చిన పూజా హెగ్డే

బ్రాలెస్ ఫొటోతో షాకిచ్చిన పూజా హెగ్డే

తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా లేకుండా బ్యాక్‌ను చూపిస్తూ కనిపించింది. దీంతో బుట్టబొమ్మ పోస్ట్ చేసిన ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో దీనిపై నెటిజన్ల నుంచి విభిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి పూజా హెగ్డే గ్లామర్ ట్రీట్ ఇవ్వడం ద్వారా మరోసారి తెగ హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X