ఈ క్వారంటైన్‌లో ఆ విషయం నాకు ఆనందాన్ని ఇచ్చింది.. పూజా హెగ్డే వీడియో వైరల్
కరోనా ధాటికి దాదాపు మూడు నెలలు ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. ఎంతటి పెద్ద స్టార్ అయినా సరే ఆ మూడు నెలలు గడప దాటకుండా ఇంట్లోనే ఉన్నారు. అయితే ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా గడిపై సెలెబ్రిటీలు ఈ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకున్నారు. కొందరు ఫ్యామిలీతో సరదాగా గడిపారు, ఆన్‌లైన్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు, ఇతర భాషలపై పట్టుసాధించారు, ఫిటెన్‌స్‌పై దృష్టి సారించారు. ఇలా ఎన్నో రకాలుగా ఈ ఖాళీ సమయాన్ని వాడుకున్నారు.
పూజా హెగ్డే సైతం తనకు దొరికిన ఈ అమూల్యమైన సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంది. ఇంట్లో వంట చేస్తూ ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేస్తూ కాలాన్ని నెట్టుకొచ్చింది. సోదరుల ప్రేమతో తడిసి ముద్దయిపోయింది. తండ్రికి బర్త్ డే సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. మ్యూజిక్ కూడా నేర్చుకుంది. ఇలా ఎన్నోరకాలుగా పూజా హెగ్డే లాక్ డౌన్‌ను ఎంజాయ్ చేసింది. అన్నింటి కంటే ముఖ్యంగా వంటింట్లో దూరి కొత్త కొత్త పదార్థాలను వండటం నేర్చుకుంది.
View this post on InstagramA post shared by Pooja Hegde (@hegdepooja) on

తాజాగా ప్రొఫెషనల్ చెఫ్‌గా మారింది పూజా హెగ్డే. ఈ మేరకు బుట్టబొమ్మ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 'మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో తెలుసుకోండి.. మానసిక సంతృప్తి అన్నింటి కంటే ముఖ్యం. ఈ క్వారంటైన్‌లో మా కుటుంబాన్ని వండి పెట్టడం నాకు ఆనందాన్ని కలిగించింది. ఆహారం చేసి పెట్టడం నాకు సంతోషం. నా మొహంపై చిరు నవ్వు వచ్చే ప్రతీది మీతో షేర్ చేసుకుంటాను..అది మీకు కూడా సంతోషాన్ని ఇస్తుందని భావిస్తున్నా'నని తెలిపింది.


Click it and Unblock the Notifications











