Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
2022లో పూజా హెగ్డే బ్యాడ్ లక్.. అత్యధిక రెమ్యునరేషన్ తో బిగ్ డిజాస్టర్స్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో కూడా అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ గత రెండేళ్ల కాలం నుంచి కూడా అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం అలాగే హిందీలో కూడా చాలా పెద్ద సినిమాల్లో నటించే అవకాశం లభిస్తోంది. దీంతో పూజా హెగ్డే రెమ్యునరేషన్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
అయితే ఆమె చేసిన సినిమాలు ఏవి కూడా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. అంతేకాకుండా దారుణమైన డిజాస్టర్స్ కూడా చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా 2022 మొదట్లో వచ్చిన రాధేశ్యామ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ తో చేసిన ఈ అడ్వెంచర్ లవ్ స్టోరీ నెగిటివ్ టాక్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా నష్టాలను కలిగించింది.

ఇక మెగా హీరోలతో చేసిన ఆచార్య సినిమా కూడా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవల కాలంలో అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా తమిళంలో ఆమె మొదటిసారి స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ అనే సినిమా చేసింది. అయితే ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. వరుస విజయాలతో ఉన్న విజయ్ కు కూడా ఒక్కసారిగా బ్రేక్ వేసినట్లు అయింది. ఇక ఇటీవల వచ్చిన సర్కస్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవాలి అని పూజా హెగ్డే అనుకుంది.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా చేసిన ఈ సినిమా ఓపెనింగ్ లోనే తీవ్రమైన నెగిటివ్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అంతగా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ 5 కోట్లు దాటించాలని చర్చలు జరుపుతున్న అమ్మడు హఠాత్తుగా ఈ ఏడాది మాత్రం వరుస డిజాస్టర్ సినిమాలతో మళ్ళీ తన ఫామ్ కోల్పోయినట్లు అయింది. మళ్ళీ ఎలాగైనా మరో విజయంతో ట్రాక్ లోకి రావాలని అనుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మహేష్ బాబు 28వ ప్రాజెక్టు ఉన్న విషయం తెలిసిందే. అలాగే తమిళంలో కూడా ఒక సినిమా చేయడానికి చర్చలు జరుపుతోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ ఇచ్చింది.