మళ్లీ బికినీలో రచ్చ చేసిన పూజా హెగ్డే: ఈ సారి తడిచిన అందాలతో అంతకు మించి!
పూజా హెగ్డే.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు, తన అందంతో పాటు అభినయంతో ఫిదా చేసేస్తోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో మాత్రమే కాదు.. మిగిలిన భాషల్లోనూ ఈ అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాదు, అందులో అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా పూజా హెగ్డే బికినీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై మీరూ లుక్కేయండి!

ఆ భాష నుంచి తెలుగులోకి ఎంట్రీ
పూజా హెగ్డే టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన ఫిగర్‌తో మాయ చేస్తోన్న సమయంలోనే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అనంతరం వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' అనే సినిమాలోనూ నటించి ఆరంభంలోనే ఫోకస్ అయింది.

వరుస ఫ్లాపులు.. అక్కడ నిరాశగానే
ఆరంభంలోనే పూజా హెగ్డే చేసిన సినిమాలు హిట్ కాకున్నా వరుస పెట్టి ప్రాజెక్టులు చేస్తూ వచ్చింది. కానీ, ఆమెకు హిట్ మాత్రం అందలేదు. ఈ క్రమంలోనే కొన్ని తెలుగు సినిమాల్లో నటించాక హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో'తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అయితే, అది కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో పూజా కెరీర్ ప్రశ్నార్థకం అవుతుందని అనుకున్నారు.

అప్పటి నుంచి వరుస విజయాలు
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లు అందుకున్న పూజా హెగ్డేకు 'అరవింద సమేత.. వీరరాఘవ'తో భారీ హిట్ వచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుని సత్తా చాటింది. అలాగే రెమ్యూనరేషన్‌నూ బాగానే తీసుకుంటోంది.

చేతి నిండా సినిమాలతో హడావిడి
టాలీవుడ్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె ఇప్పటికే 'రాధే శ్యామ్', 'ఆచార్య' షూటింగ్‌లను కూడా పూర్తి చేసుకుంది. అలాగే, కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న 'బీస్ట్'లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు హరీశ్ - పవన్ కలయికలో వచ్చే ప్రాజెక్టుతో పాటు త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రానున్న సినిమాలోనూ ఎంపికైందీ బ్యూటీ.

అందులో మాత్రం ఎప్పుడూ రచ్చే
వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం పోస్ట్ చేస్తోందీ హీరోయిన్.

అందాల విందుతో రెచ్చిపోతోంది
సుదీర్ఘ కాలంగా పూజా హెగ్డే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అప్పుడప్పుడూ హాలీడే ట్రిప్‌లను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే మాల్దీవులు వెళ్లొచ్చిన ఈ భామ.. ప్రకృతి అందాలను ఆస్వాదించింది. అలాగే, తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ వదులుతోంది. ఇలా కొద్ది రోజులుగా ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపుతోంది.

తడిచిన అందాలతో అదరగొట్టేసి
అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే అప్పుడప్పుడూ హాట్ ఫొటోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోయిన్ మాల్దీవులు ట్రిప్‌లో తీసుకున్న ఓ ఫొటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆమె నీటితో బికినీతో ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు తెగ కనువిందు చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ హాట్ పిక్ క్షణాల్లో వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











