లాక్‌డౌన్ మసాజ్.. రాజభోగం అనుభవిస్తున్న బుట్టబొమ్మ.. వీడియో వైరల్
ప్రపంచమంతా కరోనా వైరస్‌కు వణికిపోతోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. స్టార్ సెలెబ్రిటీస్ నుంచి సామాన్య జనం వరకు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో స్టార్స్ అంతా ఏదో ఒక వ్యాపకంలో బిజీ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ క్వారంటైన్ సమయాన్ని గడిపేస్తున్నారు. ఈ లాక్ డౌన్‌లో కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. స్టార్స్ అందరిలో పూజా హెగ్డే మాత్రం ఈ లాక్ డౌన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిస్తోంది.

వంటింట్లో చిట్కాలు..
కరోనా వైరస్ వల్ల స్టార్స్ మాత్రం ఇంట్లో ఉంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. క్షణ కాలం తీరిక లేకుండా బిజిబిజీగా గడిపే స్టార్స్.. లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నారు. ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వంటిళ్లు ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటున్నారు. పూజా హెగ్డే మాత్రం కొత్త కొత్త వంటకాలను చేసేస్తోంది.

కొత్త పదార్థాలతో నోరూరిస్తోంది..
పూజా హెగ్డే వంటింట్లో దూరి కొత్త కొత్త పదార్థాలను ఎలా వండాలో నేర్చుకుంటోంది. ఆ మధ్య హల్వా చేసి నెటిజన్లకు నోరూరించింది. ఇలా తీపి పదార్దాలు, పిజ్జాలు తింటూ క్వారంటైన్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అలాగే పనిలో పనిగా గిటార్ కూడా వాయించేస్తోంది.

తండ్రికి స్పెషల్ గిఫ్ట్..
తాజాగా తండ్రి కోసం కేక్‌ను తయారు చేసింది. పుట్టిన రోజు సందర్భంగా అర్దరాత్రి సర్ ప్రైజ్ చేస్తూ తాను తయారు చేసిన కేక్‌ను కట్ చేయించింది. నాన్నకు ప్రేమతో పూజా చేసిన ఈ పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Recommended Video
బ్రదర్స్‌తో మసాజ్..
తాజాగా పూజా హెగ్డే రాజభోగాలు అనుభవిస్తున్నట్టు.. ఓ వీడియో ద్వారా తెలుస్తోంది. చుట్టూ అన్నదమ్ములు చేరి పూజాను యువరాణిలా చూసుకుంటున్నారు. ఒక తలకు మసాజ్ చేయగా..మరొకరు కాళ్లు నొక్కుతున్నారు. ఇక ఈ వీడియోను షేర్ చేసిన పూజా.. తెగ మురిసిపోయింది.


Click it and Unblock the Notifications











