విలాసవంతమైన ఇంటిని కొన్న పూజాహెగ్డే.. పేరెంట్స్‌ను వదిలి ఒంటరిగానే.. ప్రియుడి కోసమేనా?
బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుస విజయాలతో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్‌గా మారింది. భారీ రెమ్యునరేషన్‌ను రాబడుతూ తన స్టామినాను నిరూపించుకొంటున్నారు. అయితే ముంబైకి, హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతూ బిజీగా ఉన్న ఈ భామ తాజాగా తన కంటూ ఓ సొంత ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి కొనుగోలు వెనుక అసలు కథ ఏమిటంటే..

మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో
2010లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో రన్నరప్‌గా నిలిచిన పూజా హెగ్డే తన సినీ కెరీర్‌లో టాప్ రేంజ్‌కు చేరడానికి చాలానే కష్టాలు పడింది. 2012లో ముగమూడి చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల్లో నటించినా అంతగా ఆదరణ దక్కలేదు. హిందీలో చాలా ఆశలు పెట్టుకొన్న మొహెంజదారో కూడా నిరాశనే మిగిల్చింది.

దువ్వాడ జగన్నాథంతో విజయాల పరంపర
ఇక తెలుగులో దువ్వాడ జగన్నాథంతో విజయాల పరంపర మొదలైంది. రంగస్థలం, మహర్షి, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, హౌస్ ఫుల్ 4, అలా వైకుంఠపురం సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, సర్కస్, ఆచార్య చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్‌తో కభీ ఈద్ కభీ దీవాళి ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

మూడు బెడ్రూంల ఫ్లాట్‌లోకి
బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకెళ్తున్న పూజా హెగ్డే తన సాధించిన సక్సెస్‌కు మురిసిపోతూ ముంబైలో మూడు బెడ్రూంల ఫ్లాట్‌ను తనకు తాను గిఫ్ట్‌గా ఇచ్చుకొన్నారట. బాంద్రాలోని సముద్రపు ఫేసింగ్‌తో విలాసవంతమైన సౌకర్యాలతో ఉన్న ఫ్లాట్‌లో తన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇటీవలే గృహ ప్రవేశం చేసిన పూజా హెగ్డే
గత రెండేళ్లుగా మంచి విజయాలు దక్కడంతో పూజా హెగ్డే భారీ పారితోషికాన్ని అందుకొంటున్నారు. ఇప్పటి వరకు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న పూజా హెగ్డే తన కష్టార్జితంతో సొంత ఇంటి కలను సాకారం చేసుకొన్నట్టు సమాచారం. ఈ మధ్యలోనే ఈ బ్యూటీ గృహ ప్రవేశం కూడా చేసిందని తెలిసింది. తన కెరీర్‌లో కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడం గమనార్హం.

బాలీవుడ్ నటుడితో రిలేషన్‌షిప్
ఇదిలా ఉండగా, పూజా హెగ్డే బాలీవుడ్ వర్థమాన నటుడు రోహన్ మెహ్రాతో రిలేషన్‌షిప్‌లో ఉందనే వార్త అప్పట్లో మీడియాలో చక్కర్లు కొట్టింది. ఒ సందర్భంలో వారిద్దరి ఒకే కారులో ప్రయాణిస్తూ మీడియా కంటికి చిక్కారు. అయితే ఇప్పుడు సొంత ఇంటిలోకి వెళ్లడంతో అనేక రూమర్లు మరోసారి గుప్పుమంటున్నాయి. పూజా ఎప్పుడూ కూడా తన తల్లిదండ్రులను వదిలి ఎప్పుడూ ఉండకపోవడమే అందుకు కారణంగా మారింది.


Click it and Unblock the Notifications











