కుదోస్ టు ‘రాధేశ్యామ్’ టీం.. గుడ్ బై చెప్పేసిన పూజా హెగ్డే
ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం ఇప్పుడు ఇటలీలో షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో వాయిదాలు పడుతూ వస్తోన్న రాధేశ్యామ్ లాక్ డౌన్ వల్ల పూర్తిగా వెనక్కిపోయింది. ఏడెనిమిది నెలల తరువాత రాధేశ్యామ్ సెట్స్‌పైకి వెళ్లింది. అక్టోబర్ నెల మొత్తం రాధే శ్యామ్ నిరంతరంగా షూటింగ్‌లు చేస్తూ బిజీగా ఉంది. అక్కడే హీరో హీరోయిన్ల బర్త్ డేలు కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే రాధేశ్యామ్ ఇటలీ షెడ్యూల్ పూర్తి కాబోతోందని తెలుస్తోంది.
ఇప్పటికే హైద్రాబాద్ షెడ్యూల్‌కు సంబంధించిన పనులన్నీ జరిగిపోతోన్నట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో రాధేశ్యామ్ కోసం భారీ సెట్‌ను నిర్మిస్తోన్నట్టు తెలుస్తోంది. ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్రయూనిట్ ఇక్కడకు వచ్చే సరికి సెట్ పనులు కూడా పూర్తి కానున్నాయి. తాజాగా పూజా హెగ్డే మాత్రం అందరి కంటే ముందే హైద్రాబాద్‌కు రాబోతోన్నట్టు తెలుస్తోంది. పూజా ఇక్కడకు వచ్చి అఖిల్ సినిమాతో బిజీ కానుందని తెలుస్తోంది.

ఈ మేరకు పూజా హెగ్డే చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రాధే శ్యామ్ ఇటాలియన్ షెడ్యూల్‌ను నేను పూర్తి చేశాను. ఈ షెడ్యూల్‌ను విజయవంతం చేసిన టీమ్‌కు కుదోస్. హైదరాబాద్‌లో కలుద్దాం ప్రభాస్ అంటూ బై బై చెప్పేసింది. హైద్రాబాద్‌లో పూజా హెగ్డే రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలతో బిజీ కానుంది. మొత్తానికి ప్రభాస్ కూడా మళ్లీ త్వరలోనే హైద్రాబాద్‌లో ల్యాండ్ కానున్నాడు.



Click it and Unblock the Notifications











