కారులో ప్రియుడితో పట్టుబడ్డ పూజా హగ్డే? బుట్టబొమ్మ లవర్ ఎవరంటే?
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే తారల్లో పూజా హగ్డే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో అగ్ర హీరోలందరితో నటించడమే కాకుండా బ్లాక్‌బస్టర్లతో కెరీర్ గ్రాఫ్‌ను ఓ రేంజ్‌లో పెంచుకొన్నది. అయితే గతంలో ఎందరో హీరోలతో అఫైర్లు వచ్చినప్పటికీ.. అవి పెద్దగా నిలబడలేదు. అయితే తాజాగా ఓ యువకుడితో ముంబైలో కలిసి కారులో వెళ్తూ కనిపించింది. బుట్ట బొమ్మ లవర్ ఎవరు? పూజా హెగ్డే సినిమాల పరిస్థితి ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
కన్నడకు చెందిన పూజా హెగ్డే సినిమా ఎంట్రీ తమిళ రంగంలో జరిగింది. ముగమూడి సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ రత్వాత ముకుంద, డీజే సినిమాలతో వరుస ఆఫర్లు పట్టేసింది. డీజే టిల్లు సినిమా హిట్ కావడంతో తెలుగులో భారీ ఆఫర్లు లభించాయి.

రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డేకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్‌పుల్ 4, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ రివ్వున దూసుకెళ్లింది.
సక్సెస్ బాటలో దూసుకెళ్తున్న బుట్టబొమ్మను వరుస వైఫల్యాలు పలకరించాయి. భారీ ఆశలు పెట్టుకొన్న విజయ్ మూవీ బీస్ట్, రాంచరణ్‌తో ఆచార్య, రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్, సల్మాన్ ఖాన్‌తో కిసి కా భాయ్, కిసి కి జాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహకు అందని విధంగా బోల్తా కొట్టాయి. దాంతో ఆమె దక్షిణాది సినిమాకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా, హిందీలో బిజీగా ఉన్న పూజా హెగ్డే.. ఇటీవల కాలంలో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమన్నాయి. పూజాకు సంబంధించిన అఫైర్ వార్తలు బాలీవుడ్ మీడియాలో హైలెట్ అయ్యాయి. కానీ ఆమె తన లవ్ మ్యారేజ్ గురించి పెదవి విప్పి క్లారిటీ ఇవ్వలేకపోయింది. అయితే తాజాగా తన ప్రియుడిగా భావిస్తున్న ఓ వ్యక్తితో మీడియా కంటపడింది.
పూజా హెగ్డే ఇటీవల ముంబైలో ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్తూ తన లవర్‌గా భావిస్తున్న యువకుడితో సన్నిహితంగా ఉంటూ కనిపించింది. ఆ వ్యక్తి ఎవరా? అని ఆరా తీస్తే.. రోషన్ మెహ్రా అని తేలింది. కారులో వారిద్దరి సిగ్గుపడుతూ మీడియా కంట పడకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం వారిద్దరి వీడియో మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











