ప్రామిస్ చేస్తున్నా.. అది చాలా కష్టంగా ఉంది.. పూజాహెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ హీరోయిన్ పూజాహెగ్డే వరుస సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉంది. వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటిస్తూ సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ సంక్రాంతి కానుకగా ఆమె నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. మొదటి నుంచే ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న చిత్రయూనిట్.. పలు అప్‌డేట్స్ ద్వారా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రికార్డులు తిరగరాశాయి. థమన్ బాణీలు ప్రేక్షక లోకాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే హీరోయిన్ పూజాహెగ్డే తనదైన స్టైల్ లో అల.. వైకుంఠపురములో పాటలపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. తాజాగా విడుదలైన బుట్టబొమ్మ సాంగ్ టీజర్ పంచుకుంటూ.. థమన్ ఆల్బమ్ నుంచి నా ఫేవరెట్ సాంగ్‌ను ఎంచుకోవడం చాలా కష్టంగా ఉందని తెలిపింది. ఇక బుట్టబొమ్మ పాటను ఉద్దేశిస్తూ.. 'మీరు వినే వాటిలో ఈ పాట చాలా అద్భుతంగా ఉండబోతోందని నేను ప్రామిస్ చేస్తున్నా. 'అల..వైకుంఠపురములో' ఆల్బమ్ నుంచి నా ఫేవరెట్ సాంగ్‌ను సెలక్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది' అని పేర్కొంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్‌లో 'అల.. వైకుంఠపురములో' తెరకెక్కడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. టబు, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











