‘అలా వదలేయడం బాధ పెట్టింది.. దూరం కావడం తట్టుకోలేకపోయా’
దక్షిణాదిలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారగా పూజా హెగ్డేకు మంచి గుర్తింపు ఉంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నది. ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో పనిచేసిన ఆమె.. తాజాగా ఓ హీరో గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను ఇష్టపడే కథా నాయకుడి గురించి ఆమె ఏం చెప్పారనే వివరాల్లోకి వెళితే..
పూజా హెగ్డే విషయానికి వస్తే.. హిట్స్, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలతోను, అలాగే భారీ బడ్జెట్ సినిమాల్లోను నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన సినిమా దేవా రిలీజై ఉత్తరాదిలో మంచి విజయాన్ని అందుకొంటున్నది. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ నేపథ్యంలో తన సినిమాల గురించి, తాను నటించే హీరోల గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

దేవా తర్వాత పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి రీమేక్ జన నాయకన్. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు. విజయ్‌తో కలిసి నటించడం ఆమెకు ఇది రెండోసారి. అంతేకాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ నటించే చివరి చిత్రంలో ఆఫర్‌ను దక్కించుకోవడం క్రేజీగా మారింది. అయితే విజయ్ పక్కన నటించడం చాలా హ్యాపీగా ఉందని ఆమె పేర్కొన్నారు.
ఇళయ దళపతి విజయ్ ఇటీవల తమిళగ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లోను కొనసాగుతూ ర్యాలీలు, సభలతో తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఓ పక్కన హెచ్ వినోద్ దర్శకత్వంలో జన నాయకన్ సినిమాలో ఓ ఎమోషనల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ విషయం గురించి చెబుతూ పూజా హెగ్డే ఎమోషనల్ అయ్యారు.

అయితే సినిమా రంగంలో విజయ్ స్టార్ హీరోగా ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగారు. ప్రేక్షకుల్లో అశేషమైన అభిమానాన్ని సంపాదించారు. అలాంటి హీరో సినిమా రంగాన్ని వదిలిపోవడం చాలా బాధగా ఉంది. తెరపైన ఆయన నటనను చూసి ఎంజాయ్ చేసే వారిలో నేను ఒకరిని. ఆయన ఇక తెరపైన కనిపించరనే విషయంత తెలిసి నేను చాలా విచారానికి గురయ్యాను. కానీ ఆయన ఎంచుకొన్న మార్గానికి నా పూర్తి సపోర్టు ఉంటుంది. ప్రజా సేవ చేయడానికి ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని పూజా హెగ్డే అన్నారు.
పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్‌తో కిసి కా భాయ్.. కిసి కి జాన్ చిత్రంలోను, అలాగే షాహిద్ కపూర్‌తో దేవా అనే సినిమాలోను నటించింది. అలాగే రెట్రో, జన నాయకన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటిని అధికారికంగా వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











