పూజా హెగ్డే బుగ్గ గిల్లిన అభిమాని.. నీ ప్రేమని నేను ఫీల్ అవుతున్నా!

Recommended Video

Pooja Hegde Cute Reply To Her Fan In Instagram | Filmibeat Telugu

డీజే, అరవింద సమేత చిత్రాలతో పూజా హెగ్డే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కుర్రకారు పూజా హెగ్డే క్యూట్ లుక్స్, అందాలకు ఫిదా అవుతున్నారు. పూజ హెగ్డే క్రేజ్ తో దర్శక నిర్మాతలు కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన పలు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా పూజా హెగ్డేకు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అరవింద సమేత

అరవింద సమేత

పూజా హెగ్డే గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అరవింద సమేత చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పూజ హెగ్డే పాత్ర కూడా కీలకమైనదే. అంతకు ముందు డీజే చిత్రంలో అందాల ఆరబోత చేసిన పూజా హెగ్డే.. అరవింద సమేతలో నటనతో ఆకట్టుకుంది.

 బుగ్గ గిల్లిన అభిమాని

బుగ్గ గిల్లిన అభిమాని

పూజా హెగ్డే బుగ్గని ఓ అభిమాని గిళ్లాడు. కానీ నిజంగా కాదు. అరవింద సమేత చిత్ర పోస్టర్ లో ఉన్న పూజా హెగ్డే బుగ్గని పట్టుకుని ఉన్న ఓ అభిమాని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఆనోటా ఈ నోటా చేరి పూజా హెగ్డేకు కూడా తెలిసింది. చాలా క్యూట్ గా ఉన్న ఈ ఫోటోపై పూజ హెగ్డే కూడా సరదాగా స్పందించింది. నీ ప్రేమ నాకు తెలుస్తోంది అంటూ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది.

మహర్షి చిత్రంలో

మహర్షి చిత్రంలో

కుర్రకారు పూజ హెగ్డే కోసం ఎలా పిచ్చెక్కి పోతున్నారో చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. పూజ హెగ్డే ప్రస్థుం సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోంది. మహేష్ సరసన నటిస్తున్న మహర్షి చిత్రం చివరి దశకు చేరుకుంది. త్వరలో ఈ చిత్ర విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు. మరో వైపు ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శత్వంలో నటిస్తున్న చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్‌లో కూడా

బాలీవుడ్‌లో కూడా

పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటిస్తోంది. గతంలో హృతిక్ రోషన్ సరసన మొహంజదారో చిత్రంలో నటించినా విజయం సాధించలేదు. పూజ హెగ్డే ఒకలైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ముకుంద, సాక్ష్యం లాంటి చిత్రాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X