నమ్రతకు పూజా హెగ్డే షాక్: ధీటుగానే స్పందించిన మహేశ్ భార్య.. హీరోయిన్‌కు ఝలక్.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఆమె.. ఆ తర్వాత నటించిన చిత్రాలు కూడా ఆశించినంత ఫలితాలను రాబట్టలేకపోయాయి. అయినప్పటికీ ఆమెకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె కెరీర్ దూసుకుపోతోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ఆమె.. తాజాగా మహేశ్ భార్య నమ్రతకు షాక్ ఇచ్చిందట. ఇంతకీ ఏంటా షాక్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

పూజా హెగ్డే హ్యాట్రిక్ చేసేసింది

పూజా హెగ్డే హ్యాట్రిక్ చేసేసింది

పూజా హెగ్డే అంతకు ముందు పలు చిత్రాల్లో నటించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత'తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి', వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్'లో హీరోయిన్‌గా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవడంతో అమ్మడి ఖాతాలో హ్యాట్రిక్ నమోదైంది.

మరో రెండు భారీ అవకాశాలు

మరో రెండు భారీ అవకాశాలు

వరుస విజయాలతో దూసుకుపోతోంది గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్‌తో కలిసి నటించిన సినిమా జనవరి 12న విడుదల అవుతోంది. దీనితో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘జాన్'లోనూ ఆమె హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వీటితో పాటు కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది.

మహేశ్ సినిమాలో అవకాశం

మహేశ్ సినిమాలో అవకాశం

గత ఏడాది సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి'లో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆమెకు మహేశ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. అయితే, దీనికి సూపర్ స్టార్ హీరో కాదు.. ఆయన బ్యానర్‌లో వస్తున్న సినిమా ‘మేజర్'కు పూజా హెగ్డేను సంప్రదించారని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

నమ్రతకు పూజా ఝలక్.. ధీటైన ఆన్సర్

నమ్రతకు పూజా ఝలక్.. ధీటైన ఆన్సర్

అడవి శేష్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను నిర్మాతల్లో ఒకరైన మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ సంప్రదించారట. ఈ సినిమాకు ఓకే చెప్పిన పూజా.. అందుకు గానూ రూ. 2 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తోంది. దీంతో షాకైన నమ్రత.. మిగిలిన నిర్మాతలతో చర్చించిన అనంతరం పూజాకు మొండిచేయి చూపించారని సమాచారం.

ఇది ఆయన బయోపిక్

ఇది ఆయన బయోపిక్

సక్సెస్‌ఫుల్ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్'. మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ‌శికిర‌ణ్ తిక్క. సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి కథా సహాకారం అందించింది కూడా శేష్ కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X