డాల్ఫిన్ పోజ్‌లో బుట్టబొమ్మ.. అది చాలా కష్టమేనట!!
టాలీవుడ్ బుట్టబొమ్మ లాక్ డౌన్‌లో ఎంతగా హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే. సమంత అందంగా లేదని అనడం, ఆపై సోషల్ మీడియా హ్యాక్ అయిందని నాటకాలు ఆడటం అందరికీ తెలిసింది. సమంత ఫ్యాన్స్, పూజా హెగ్డే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాటల యుద్దానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో ఎంతగానో సెన్సేషన్ అయింది. ఈ మ్యాటర్‌లోకి చిన్మయి, నందినీ రెడ్డి వంటి వారు ఎంటర్ అవడం మరింత అగ్గి రాజేసింది.
ఇక పూజా హెగ్డే లాక్ డౌన్‌లో తన టాలెంట్‌కు పదునుపెట్టింది. వంటింట్లో దూరి కొత్త వంటకాలు నేర్చుకుంది. ఫ్యామిలీ మెంబర్స్‌కు ప్రేమగా వడ్డించింది కూడా. పూజా హెగ్డే ఫ్యామిలీ మెంబర్స్‌తో సపర్యలు చేయించుకున్న వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సోదరులందరూ కలిసి ఆమె కాళ్లు, చేతులు నొక్కుతూ మసాజ్ చేసిన వీడియో బాగా చక్కర్లు కొట్టింది. ఇక ఈ భామ ఇప్పుడు షూటింగ్‌లకు సిద్దమవుతోందని తెలుస్తోంది.

పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్‌లో నటిస్తోంది. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇకపోతే సెప్టెంబర్‌లో రాధేశ్యామ్ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ మేరక చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ఓ ట్వీట్ చేశాడు. ఇక పూజా కూడా అందుకు అంతా సిద్దమవుతోన్నట్టు కనిపిస్తోంది. అందు కోసం తన శరీరాన్ని, మనసును సంసిద్దం చేసేందుకు డాల్ఫిన్ ఫోజులతో యోగా చేస్తోంది. ఇలా చేయడం చాలా కష్టం అంటూ చూపిస్తున్న ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











