మేడమ్ సార్... రెండు సార్లు... అంతే...!

అలవైకుఠ పురంలో పూజా మేడమ్ గారి కాళ్లు, ఇంకా కళ్లల్లోనే మెదులుతున్నాయి. ఎన్ని సార్లు చూసినా తనవి తీరక ఫ్యాన్స్ ఇప్పటికే పరేషాను అవుతుంటే ఇప్పుడు అమ్మడు డోస్ రెండు రెట్లు పెంచుతోందట. అంటే రాథేశ్యామ్ లో పూజా డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న రాథేశ్యామ్ లో పూజా, ప్రభాస్ కు జోడీగా నటించబోతున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ తో అమ్మడి జోడీ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో బాగా అంచనాలు పెంచేసింది. ఇక ఈ అంచనాలకు తగ్గట్లు పూజా కూడా అందాల విందు వడ్డించేందుకు సిద్ధమవుతోందట. అదీ ఒక్కసారి కాదు, రెండుసార్లు. అంటే, అమ్మడు డ్యూయెల్ రోల్ లో కనువిందు చేయబోతోందన్నమాట.

Pooja Hegde double treat.. Actress to be seen as twins In Radhe Shyam

రాథేశ్యామ్ లో పూజ కవలలుగా కనిపించబోతోందట. ఇక ఈ రెండు పాత్రలూ ఒకరి సంగతి మరొకరికి తెలియకుండా ప్రభాస్ తోనే ప్రేమలో పడతాయని తెలుస్తోంది. చివరకు ఇద్దరిలో ఒకరు తమ ప్రేమను త్యాగం చేస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రాథా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాథేశ్యామ్ లో అలనాటి అందాల తార భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ పీరియాడిక్ డ్రామాలో ప్రభాస్, పూజా కెమిస్ట్రీ హైలైట్ గా నిలవబోతోందని తెలుస్తోంది. మరి జనాల అంచనాలను ఈ జంట ఏమేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X