twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీలో బుట్ట బొమ్మ డ్యాన్స్.. సెగలు రేపుతున్న లేటెస్ట్ వీడియో.. పూజను ఇంత హాట్ గా చూసి ఉండరు;

    |

    పూజా హెగ్డేకు అస్సలు పరిచయం అక్కర్లేదు. అంతలా ఈ భామ అద్భుతమైన నటనను కనబరుస్తూ ఆకట్టుకుంటోంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన ఈ భామ.. సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సాధించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు షేర్ చేసిన పూజా రచ్చ రేపింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

    అలా ఎంట్రీ ఇచ్చి

    అలా ఎంట్రీ ఇచ్చి

    కర్ణాటక లోని మంగళూరు ప్రాంతానికి చెందిన పూజా హెగ్డే తల్లితండ్రులు ముంబైలో సెటిల్ అయ్యారు. నటన మీద ఆసక్తితో ముందు మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ అందరినీ ఆకట్టుకున్న ఈ భామ అనేక నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు పని చేసింది. ఇలా చాలా కాలం పాటు ప్రకటనల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపిన ఆమె దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 'మూగమూడి' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

    వరుస సినిమాలు

    వరుస సినిమాలు

    ఈ రెండు సినిమాలు పెద్దగా పేరు తెచ్చిపెట్ట లేదు కానీ ఆ తరువాత అనంతరం 'ఒక లైలా కోసం' అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కూడా ఆమెకు సక్సెస్‌ తెచ్చిపెట్ట లేదు కానీ ఫేమ్ తెచ్చుకుంది. అయితే ముందు నుంచి అనేక ఫ్లాపులు అందుకున్న ఆమె ఏకంగా హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా ఫ్లాప్ అయినా తెలుగులో ఆమెకు గోల్డెన్ వెల్కమ్ చెప్పారు.

    తమిళ్ లో కూడా

    డీజే సినిమాతో హిట్స్ అందుకోవడం మొదలుపెట్టిన ఆమె 'అరవింద సమేత.. వీరరాఘవ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ అయింది భారీ రెమ్యూనరేషన్‌ అందుకుంటూ షాకిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్', 'ఆచార్య' షూటింగ్‌లను కూడా కంప్లీట్ చేసేసింది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది.

    సినిమాల విషయానికి వస్తే

    వీటితో పాటు హరీశ్ - పవన్ కలయికలో వచ్చే సినిమాతో పాటు త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రానున్న ప్రాజెక్టులోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. వరుస సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది.

    Recommended Video

    Latest Tollywood Updates : రవితేజ మూవీలో తెలుగు అమ్మాయి స్పెషల్ సాంగ్..! || Filmibeat Telugu

    మాల్దీవుల్లో

    ఈ బ్యూటీ ఇప్పుడు స్విమ్ సూట్ వేసుకుని మాల్దీవుల్లో తన తీరిక సమయాన్ని గడుపుతోంది. మాల్దీవుల రిసార్ట్‌లలో అల్పాహారం తీసుకుంటున్న తన తాజా చిత్రాలను, వీడియోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటోలు వీడియోలను ఆమె ఫ్యాన్స్ సహా కుర్ర కారు వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

    English summary
    Pooja Hegde enjoys floating breakfast in Maldives in brown bikini.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X