Pooja Hegde: దేవకన్యలా దర్శనమిచ్చిన పూజా హెగ్డే.. అసలైన అందాలు దాచట్లేదుగా!
చిన్న హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమై స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కీర్తి తెచ్చుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు పూజా హెగ్డే జన్మించింది. చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకొని ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు మూడు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ తర్వాత గ్లామర్ డోస్ పెంచి యూత్ ను అట్రాక్ట్ చేసింది. బికినీలు ధరించి మరి హాట్ ట్రీట్ అందించింది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్ లతో సందడి అందాలు ఆరబోస్తుంది. తాజాగా అలాంటి పిక్స్ వదిలింది.
మాస్క్ మూవీతో : ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న వాళ్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాతి కాలంలో హీరోయిన్ గా వెండితెరపై ప్రత్యక్షమైంది. 2012లో తమిళంలో వచ్చిన మూగమూడి (తెలుగులో మాస్క్) మూవీతో కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటి తన అందంతో ఆకట్టుకుంది.

హృతిక్ రోషన్ తో : 2014లో నాగ చైతన్యతో ఒక లైలా కోసం మూవీతో జత కట్టిన పూజా హెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్ తో ముకుంద సినిమాలో లంగా ఓణీలతో పద్ధతిగా కనిపించి ఎంతో మంది యూత్ మనసులను కొల్లగొట్టింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోయేసరికి హిందీలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మొహంజోదారో చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
జిగేలు రాణిగా : హిందీలో కూడా మొదటి సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోయేసరికి మళ్లీ తెలుగు బాట పట్టింది బ్యూటిఫుల్ పూజా హెగ్డే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మూవీలో గ్లామర్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటి స్విమ్ సూట్ లో దర్శనం ఇచ్చి అట్రాక్ట్ చేసింది. తర్వాత రంగస్థలంలో జిగేలు రాణి అంటూ తెలుగు ప్రేక్షకులచేత పాడేలా చేసింది. తర్వాత అనేక చిత్రాలతో ఫుల్ బిజీగా మారింది ఈ బ్యూటి.
కలిసి రాని సినిమాలు : సాక్ష్యం మినహా అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠ పురములో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అనంతరం రాధేశ్యామ్, ఆచార్య, F3, బీస్ట్ చిత్రాలతో వరుసగా ఫ్లాప్ లు చవి చూసింది. హిందీలో హౌజ్ ఫుల్ 4, సర్కస్ వంటి చిత్రాలు కూడా పూజా హెగ్డేకు కలిసి రాలేదు. అయినా పూజా హెగ్డేకు అవకాశాలు రావడం మాత్రం తగ్గలేదు.
మహేశ్-పవన్ తో : ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28, పవన్ కల్యాణ్-సుజిత్ కాంబో OGలో నటిస్తోంది ఈ భామ. అలాగే సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీలో విక్టరీ వెంకటేష్ కు చెల్లెలుగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన బతుకమ్మ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పూజా హెగ్డే చాలా అందంగా కనువిందు చేసింది.

దేవకన్యలా.. క్లీవేజ్ షో : సినిమాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలు, కెరీర్, పర్సనల్ విషయాలతో టచ్ లో ఉంటుంది పూజా హెగ్డే. తాజాగా ఇన్ స్ట్రా గ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ వదిలింది. వీటిలో వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న పూజా హెగ్డె తెల్లని పాలరాతి శిల్పంలా, దేవకన్యలా మైమరిపించింది. అలాగే జారుతున్నటువంటి ఈ డ్రెస్సులో ఎద అందాలు చూపిస్తూ గ్లామర్ ఒలకబోసింది. వైరల్ అవుతున్న ఈ ఫొటోలకు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











