ఆ స్టార్ హీరో నా కారవాన్‌లోకి చొరబడి.. చేదు అనుభవంపై పూజా హెగ్డే.. ఆ హీరో ఎవరంటే?
సినిమా ఇండస్ట్రీలో హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అగ్ర నటిగా కొనసాగుతున్న అందాల భామల్లో పూజా హెగ్డే ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ అనే భాషాభేదం లేకుండా టాప్ హీరోయిన్‌గా గత రెండు దశాబ్దాలుగా తన కెరీర్ గ్రాఫ్‌ను రివ్వును దూసుకుపోయేలా చేస్తున్నారు. ఇటీవల కాలంలో వరుస డిజాస్టర్లు ఎదురైనప్పటికీ.. ఇండస్ట్రీలోని టాప్ హీరోల సరసన అవకాశాలను చేజిక్కించుకొంటూ ఆమె తన సత్తాను చాటుకొంటున్నారు. అయితే పూజా హెగ్డే గత ఇంటర్వ్యూలో ఓ హీరోపై చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆమె కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే గురించి, ఆమె చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే..
పూజా హెగ్డే ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఆమె పోస్టులకు విపరీతంగా అభిమానులు స్పందిస్తున్నారు. ఇటీవల తాను, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమా 6వ సంవత్సరం పూర్తి చేసుకొన్నదనే విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకొన్నారు. ఆ పోస్టుకు ఆమె ఫ్యాన్సే కాకుండా అల్లు అర్జున్ అభిమానులు కూడా వైరల్ చేశారు. పూజా హెగ్డే కెరీర్‌లో అల వైకుంఠపురంలో సినిమా అతిపెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇలా ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలో ఆమె పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అయింది. ఇండస్ట్రీలో కొందరు స్టార్స్, నటీనటులు తమ స్థాయి మరిచి హద్దు మీరుతుంటారు. కొన్నిసార్లు షూటింగులో ప్రాథమికంగా అనుసరించాల్సిన నియమాలు, నైతికతను మరిచి చెడుగా బిహేవ్ చేస్తుంటారు. గతంలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటించేటప్పుడు.. నా అనుమతి లేకుండా ఓ హీరో నా కార్‌వాన్‌లోకి వచ్చాడు. ఆ సమయంలో ఆయన ఎంత పెద్ద హీరో అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా అతడు ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాను అని పూజా హెగ్డే చెప్పారు.
నా కార్‌వాన్‌లోకి వచ్చి నాతో చెడుగా బిహేవ్ చేయడానికి ప్రయత్నించాడు. దాంతో ఆయన చెంపపై కొట్టాను. అప్పటి నుంచి ఆయనతో నటించకూడదని అనుకొన్నాను. ఆయనతో ఎప్పటికీ నటించకూడదని నిర్ణయించుకొన్నాను. ఇక ముందు కూడా నేను ఆయనతో నటించను అని పూజా హెగ్డే అన్నారు. అయితే ఆ హీరో ఎవరనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే సోషల్ మీడియాలో సదరు హీరో సినిమా ఇటీవల ఫ్లాప్ అవ్వడంతో ఈ పోస్టు బయటకు వచ్చిందని చెప్పుకొంటున్నారు.
ఇదిలా ఉండగా, పూజా హెగ్డే నటించిన జన నాయగన్ చిత్రం సెన్సార్ కోరల్లో చిక్కుకొని విడుదల వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్‌కు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ గురించి మద్రాస్ హైకోర్టులోనే తేల్చకోవాలని సుప్రీం సూచించింది. ఈ సినిమా వివాదంపై కోర్టు విచారించేందుకు సిద్దమైంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన ఆచార్య, సర్కస్, కిసి కా భాయ్ కిసి కి జాన్, దేవా, రెట్రో, కూలీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆమె నటించిన జన నాయగన్ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న హై జవానీ తో ఇష్క్ హోనా హై, కాంచన 4, దుల్కర్ సల్మాన్ 41వ సినిమాలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











