ఆ విషయంలో పవన్ కళ్యాణ్‌లానే ఫీల్ అయిందంట.. పూజా హెగ్డే ట్వీట్ వైరల్
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, ఆయన ఫ్యామిలీకి కరోనా సోకడం గురించి అందరూ బాధపడుతున్నారు. యావత్ భారత సినీ పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలందరూ అమితాబ్ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. కూలీ సినిమా షూటింగ్‌లో భాగంగా అమితాబ్ తీవ్రంగా గాయపడిన నాటి విషయాన్ని ప్రస్థావించాడు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
అమితాబ్ ఆరోగ్యంపై చింతించిన పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యాడు. నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.'మాకు ఎంతో ప్రియమైన అమితాబ్ బచ్చన్ గారికి.. మీకు కూలీ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం గురించి తెలిసినప్పుడు మేమంతా ఆందోళనకు గురయ్యాము. మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ మొత్తం మీ కోసం ప్రార్థనలు చేశాం. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది.

మీరు ఎల్లప్పుడూ అమితమైన ప్రేమ, విధేయత, ఆప్యాయతను చూపిస్తూనే ఉన్నారు. మీ ప్రతిభను మాత్రమే కాదు.. మీకు గల పోరాడే శక్తి, సింప్లిసిటీ, గర్వంలేని ఉదార స్వభావం వల్లే మేమంతా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం. మీకు, అభిషేక్ బచ్చన్ గారికి కరోనా సోకిందనే వార్త విన్నాక నాకు ఎంతో బాధ కలిగింది. లార్డ్ ధన్వంతరి ఉన్న శక్తులతో మీకు, అభిషేక్ గారిని నయం చేయాలి. ఎంతో ఆరోగ్యంగా మీరు తిరిగి రావడం నేను చూడాలని అనుకుంటున్నాను'అని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశాడు. అయితే అమితాబ్ విషయంలో పూజా హెగ్డే కూడా అలానే ఫీల్ అయిందంటా. ఈ మేరకు పవన్ పోస్ట్‌ను పూజా హెగ్డే షేర్ చేస్తూ డిట్టో.. అంటూ మీకు పాజిటివ్ ఎనర్జీ, ప్రేమను పంపిస్తున్నానని పేర్కొంది.


Click it and Unblock the Notifications











