బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
గత రెండేళ్ల నుంచి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న బ్యూటీ పూజా హెగ్డే. అసలు ఆమె ఈ రేంజ్ లో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకుంటుందని మొదట్లో ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ ఫామ్ లో లేకపోవడం కూడా బుట్టబొమ్మకు బాగా కలిసొచ్చింది. అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా పెద్ద సినిమాలను మాత్రం రిజెక్ట్ చేయడం లేదట.
చాలా రోజుల తరువాత మరో బిగ్ బడ్జెట్ సినిమాకు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాలో చరణ్ కు జోడిగా పూజ హెగ్డేను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. పూజా ఒకవైపు రాధేశ్యామ్ సినిమాతో పాటు బాలీవుడ్ సినిమాలతో చాలా బిజీగా ఉంది.
ఘనంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటాషా దలాల్ వివాహం (ఫొటోలు)

పూజా ఎంత బిజీగా ఉన్నా కూడా రామ్ చరణ్ పక్కన నటించడానికి ఆఫర్ రాగానే ఒప్పేసుకుందట. ఆచార్య సినిమా హిట్టయితే అమ్మడి రేంజ్ మరో లెవెల్ కు వెళ్లడం కాయం. ఇక బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ అందుకుంటోంది.
అలాగే అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ క్లిక్కయినా కూడా బోనస్ అనే చెప్పాలి. ఇక త్వరలో కోలీవుడ్ స్టార్ విజయ్ తో ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. విజయ్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక పూజా అందులో మెయిన్ హీరోయిన్ గా కనిపించడానికి రెడీ కానున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











