అఖిల్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది.. పూజా హెగ్డే అల్లరి!
ప్రస్తుతం పూజా హెగ్డే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. తెలుగులో ఈ బుట్టబొమ్మ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బ్యాచ్‌లర్ షూటింగ్‌కు పూజా హెగ్డే గుడ్ బై చెప్పే సమయం వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక ఈ మేరకు సెట్‌లో పూజా హెగ్డే తెగ అల్లరి చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో అఖిల్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
అఖిల్ పూజా హెగ్డేల కెమిస్ట్రీ ఈ మూవీకే హైలెట్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే వదిలిన టీజర్,పోస్టర్లు, పాటలు అన్నీ కూడా ఎంతో రొమాంటిక్‌గా ఉన్నాయి. ఇక వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీయే కాకుండా ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయినట్టు కనిపిస్తోంది. తాజాగా పూజా హెగ్డే చేసిన ఓ కోతి పనికి అఖిల్ షాక్ అయ్యాడు. మామూలుగా సెట్‌లొ అఖిల్ తన దర్శకుడు చెబుతున్న సీన్ గురించి ఎంతో లీనమైనట్టున్నాడు.

అయితే పూజా హెగ్డే మాత్రం అఖిల్ వెనకాలకు వెళ్లి కోతి చేష్టలన్నీ చేసింది. అఖిల్, డైరెక్టర్ ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఇలా డిస్టర్బ్ చేస్తున్నాను అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. బ్యాచ్‌లర్ సెట్‌లో ఇది చివరి రోజు అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇక పూజా హెగ్డే రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అన్నింట్లో కెల్లా పూజా హెగ్డే మొదటగా ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది.


Click it and Unblock the Notifications











