బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే!
హాట్ బ్యూటీ పూజ హెగ్డే క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. మహెష్ బాబు సరసన మహర్షి చిత్రంలో, ప్రభాస్ కు జోడిగా ఓ చిత్రంలో పూజ హెగ్డే నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే వచ్చిన అవకాశాలని వదులుకోవడం లేదు. కొన్నేళ్ల క్రితం పూజా హెగ్డే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన నటించిన మొహంజదారో చిత్రం నిరాశనే మిగిల్చింది.
మొహంజదారో తర్వాత పూజ హెగ్డేకు బాలీవుడ్ లో పెద్ద ఆఫర్లు రాలేదు. ప్రస్తుతం పూజ హెగ్డే హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సాజిద్ నడియావాలా నిర్మాత. హౌస్ ఫుల్ 4లో పూజ హెగ్డే నటనకు సాజిద్ బాగా ఇంప్రెస్ అయ్యారట. దీనితో తాను నిర్మించబోయే తదుపరి రెండు చిత్రాల్లో కూడా పూజ హెగ్డేనే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు చిత్రాల్లో ఓ చిత్రం బాలీవుడ్ ఖాన్ త్రయం అయిన అమీర్, షారుఖ్, సల్మాన్ లలో ఒకరితో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే పూజ హెగ్డే బడా స్టార్ హీరో సరసన నటించనుంది. ఇటీవల పూజ హెగ్డేకు మంచి విజయాలు దక్కుతున్నాయి. డీజే చిత్రం పరవాలేదనిపించగా, అరవింద సమేత మంచి విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











