twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నగ్నంగా నీ ఫోటో కావాలని నెటిజన్‌ రిక్వెస్ట్.. పూజాహెగ్డే పంపిన ఫోటో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

    |

    అందాల భామ పూజా హెగ్డే వరుస విజయాలతో అటు టాలీవుడ్‌లోను.. ఇటు బాలీవుడ్‌లోను దూసుకెళ్తున్నది. గతేడాది ఆరంభంలో అలా వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకొని అగ్ర హీరోయిన్‌గా తన సత్తాను చాటుకొన్నారు. అయితే తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్ చాటింగ్ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన తుంటరి పనికి పూజా హెగ్డే దిమ్మ తిరిగే సమాధానం ఎలా ఇచ్చారంటే...

     బ్లాక్ బస్టర్ విజయం తర్వాత

    బ్లాక్ బస్టర్ విజయం తర్వాత

    అల వైకుంఠపురం చిత్రం తర్వాత టాలీవుడ్‌లో అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంతో పూజా హెగ్డే మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా విడుదల జాప్యమైంది.

    ప్రభాస్‌తో కలిసి రాధే శ్యామ్‌లో

    ప్రభాస్‌తో కలిసి రాధే శ్యామ్‌లో

    ఇక ప్రభాస్‌తో కలిసి రాధేశ్యామ్ చిత్రంలో పూజా హెగ్డే నటించింది. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రం కూడా రిలీజ్ వాయిదా పడింది. ఇలా అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న పూజా హెగ్డే ఆట విడుపుగా ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది.

     ఇన్స్‌టాలో నెటిజన్ తుంటరి ప్రశ్న

    ఇన్స్‌టాలో నెటిజన్ తుంటరి ప్రశ్న

    ఇన్స్‌టాగ్రామ్‌లో చాటింగ్ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా ఓ నెటిజన్ తుంటరి ప్రశ్న వేశారు. నీవు నగ్నంగా ఉన్న ఫోటో ఒకటి పోస్టు చేయమని కోరగా.. ఏమాత్రం ఇరిటేట్ కాకుండా తన బుర్రను ఉపయోగించి ఆ నెటిజన్‌ను కంగు తినిపించింది.

    న్యూడ్ ఫోటోను పంపించిన పూజా హెగ్డే

    న్యూడ్ ఫోటోను పంపించిన పూజా హెగ్డే

    నెటిజన్‌ అడిగిన న్యూడ్ ఫోటో ప్రశ్నకు సమాధానంగా ఓ ఫోటోను పంపించింది. తన మొకాళ్ల వరకు బట్టలు లేకుండా ఫోటో తీసి.. నగ్నంగా ఉన్న నా పాదాల ఫోటో చూడు అంటూ పూజా హెగ్డే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దాంతో పూజా ప్రదర్శించిన చతురతకు అభిమానులు ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు.

    Recommended Video

    Prabhas Radhe Shyam Teaser Date Fixed
    పూజా హెగ్డే కెరీర్ ఇలా

    పూజా హెగ్డే కెరీర్ ఇలా

    పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో సర్కస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రంలో పూజా హెగ్డే ఓ కీలక పాత్రలో నటించనున్నారు.

    English summary
    Pooja Hegde gives fitting answer to Netizen's who request for nude photo in instagram chat. She posted bare foot by posting Nange Pao. Many fans appreciated her intelligence showed in the chat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X