twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దూసుకుపోతున్న పూజ హెగ్డే వీడియో.. ఎవరైనా ట్రై చేశారో నడ్డి విరుగుతుంది!

    |

    టాలీవుడ్ లో జోరుందున్న హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. ప్రస్తుతం పూజా హెగ్డేకు వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కుతున్నాయి. అరవింద సమేత, డీజే లాంటి చిత్రాలతో పూజా హెగ్డేకు యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. డీజే చిత్రంలో పూజ హెగ్డే గ్లామర్, డాన్సులు హాట్ టాపిక్ గా మారాయి. దీనితో దర్శక నిర్మాతలు పూజ హెగ్డేని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పూజ హెగ్డే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్. తాజాగా పూజా పోస్ట్ చేసిన ఓ వీడియోకు లక్షల్లో లైకులు వస్తున్నాయి.

     ఫిట్‌నెస్ కోసం

    ఫిట్‌నెస్ కోసం

    ప్రస్తుతం హీరోయిన్లు నాజూకుగా కనిపించడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. కాస్త బొద్దుగా కనిపించినా వెంటనే జిమ్ లోకి వెళ్ళిపోయి చెమటలు పట్టేలా కసరత్తులు చేస్తున్నారు. టాలీవుడ్ లో జిమ్ లో తరచుగా కనిపించే హీరోయిన్లు పూజా హెగ్డే, ప్రీత్ సింగ్. పూజా హెగ్డే తరచుగా జిమ్ లో కష్టపడుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. జిమ్ లో అంతలా కష్టపడుతుంది కాబట్టే పూజ హెగ్డే నాజూకు అందంతో ఆకట్టుకుంటోంది.

    విల్లులా వంచేసింది

    పూజా హెగ్డే వెనక్కు వాలుతూ తన శరీరాన్ని విల్లులా వంచేసింది. ఈ వీడియో నెటిజనలని ఆశ్చర్యపరుస్తోంది. అంత కష్టమైన భంగిమని పూజా హెగ్డే చాలా సులువుగా చేసేసింది అంటున్నారు. ఈ వీడియోకు కేవలం 6 గంటల్లోనే 2 లక్షల 50 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇలాంటి వీడియోని తప్పనిసరిగా మీతో పంచుకోవాలి. అందుకే పోస్ట్ చేస్తున్నా అని పూజా హెగ్డే తెలిపింది.

    అందరూ చేయలేరు

    అందరూ చేయలేరు

    పూజ హెగ్డేలాగా శరీరాన్ని విల్లులా వంచాలంటే అందరికి సాధ్యం కాదు. కేవలం సాధన వున్నవారు మాత్రమే ఈ ఫీట్ చేయగలరు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ట్రై చేస్తే నడ్డి విరగడం ఖాయం అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఫిట్ నెస్ కోసం హీరోయిన్లు యోగ, జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. బాలీవుడ్ లో ఇలాంటి భంగిమలతో శిల్పా శెట్టి ఒకప్పుడు హీటెక్కించింది.

     అరవింద సమేతతో బిగ్గెస్ట్ హిట్

    అరవింద సమేతతో బిగ్గెస్ట్ హిట్

    పూజ హెగ్డే గత ఏడాది ఎన్టీఆర్ సరసన అరవింద సమేత చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో పూజా హెగ్డే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసుకుంది. అరవిందగా పూజా హగ్దే నటన అందరిని మెప్పించింది. ప్రస్తుతం పూజా హెగ్డే సూపర్ స్టార్ మహేష్ సరసన మహర్షి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. అదేవిధంగా ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శత్వంలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

    English summary
    Pooja Hegde gym workout goes viral in social media. Pooja became crazy heroine in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X