Pooja Hedge విజయ్ దేవరకొండతో ప్యాన్ ఇండియా మూవీ.. దర్శకుడు ఎవరంటే?

కెరీర్ మొదట్లో ఊహించని విధంగా అపజయాలు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తర్వాత మెల్లగా గ్లామర్ డోస్ పెంచి మంచి అవకాశాలు సొంతం చేసుకుంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బికినీతో కనిపించిందో అప్పటినుంచి పూజా హెగ్డే కెరీర్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె ఏలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఫలితాలను అందుకున్నాయి. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో.. సినిమాలో గ్లామరస్ బ్యూటీ గా నటించిన తర్వాత పూజ హెగ్డే రేంజ్ పెరిగింది అనే చెప్పాలి. ఆ సినిమా సక్సెస్ తో ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఎలాంటి సినిమా చేసినా కూడా ఊహించని స్థాయిలో కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్నాయి.

గత కొంతకాలంగా పూజా హెగ్డే పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆమెతో సినిమాలు చేయడానికి అగ్ర హీరోలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల వరుసగా బాక్సాఫీసు వద్ద బుట్టబొమ్మ ఊహించని డిజాస్టర్స్ చూడాల్సి వచ్చింది. ముందుగా ప్రభాస్ తో నటించిన రాధే శ్యామ్ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించిన పూజా హెగ్డే మరో డిజాస్టర్ ను చూడాల్సి వచ్చింది. ఇక తమిళంలో నటించిన విజయ్ బీస్ట్ సినిమా కూడా తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.

Pooja Hegde has been roped in for the female lead in Vijay Deverakonda Jana Gana Mana

ఇక ప్రస్తుతం పూజా బాలీవుడ్ ఇండస్ట్రీ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ బ్యూటీ హవా అయితే ఏమాత్రం తగ్గలేదు. మళ్లీ ఎప్పటిలానే మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమా సెట్స్ కు వెళ్ళడానికి సిద్ధంగా ఉండగా కొంతమంది యువ హీరోలు కూడా ఈ బ్యూటీ తో సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది

విజయ్ దేవరకొండ త్వరలో స్టార్ట్ చేయబోయే మరొక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా పూజా హెగ్డే హీరోయిన్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరొక పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన పై ఇదివరకే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పవర్ఫుల్ భారత సైనికుడిగా కనిపించబోతున్నాడు. అయితే అతనికి జోడీగా బుట్టబొమ్మను అనుకుంటున్నారని ఇదివరకే ఒక టాక్ అయితే వచ్చింది. ఇక రీసెంట్ గా మరొకసారి దర్శకుడు ఆమెతో కథ చర్చలు జరిపినట్లు సమాచారం. పూజా హెగ్డే ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో సరికొత్తగా నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఇదివరకే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో లైగర్ అనే సినిమాను పూర్తి చేశాడు. ఆ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. ఇక జనగణమన అనే ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X