పూజా హెగ్డే అందాల విందు: అలాంటి బట్టలతో మొత్తం కనిపించేలా.. అదిరిన బుట్టబొమ్మ గ్లామర్ ట్రీట్

కళ్లు మిరుమిట్లు గొలిపే అందం.. చూపు తిప్పుకోకుండా చేయగల యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న ఆమె.. ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. తద్వారా వరుసగా ఆఫర్లను అందకుంటూ దూసుకుపోతోంది. సినిమాల్లోనే కాదు.. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలోనూ గ్లామర్ ట్రీట్ చేసే ఈ బ్యూటీ.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే పూజా హెగ్డే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అలా తన అందచందాలతో చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది. అదే సమయంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించడంతో పాటు ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటించింది. ఫలితంగా మోడల్‌గా ఫేమస్ అయిపోయింది.

గోపికమ్మలా టాలీవుడ్‌లోకి వచ్చింది

గోపికమ్మలా టాలీవుడ్‌లోకి వచ్చింది

మోడలింగ్ రంగంలో తన సత్తాను నిరూపించుకున్న పూజా హెగ్డేకు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే తమిళ సినీ ఇండస్ట్రీలో రూపొందిన 'మూగమూడి'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వా తెలుగులో 'ముకుంద', 'ఒక లైలా కోసం' అనే సినిమాలను చేసింది. ఇవి మాత్రం సక్సెస్‌ను ఇవ్వలేదు. కానీ, గోపికమ్మగా ఆమె తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపును అందుకుంది.

హిట్లు లేకున్నా.. వరుస అవకాశాలు

హిట్లు లేకున్నా.. వరుస అవకాశాలు

పూజా హెగ్డే ఆరంభంలోనే పలు పరాజయాలను అందుకోవడంతో ఆమె కెరీర్ సాఫీగా సాగదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఏకంగా హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా ఫ్లాప్ అయింది. మరోపక్క టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరి సరసనా నటించిందీ బ్యూటీ.

స్టార్ హీరోయిన్‌గా పూజా... భారీగానే

స్టార్ హీరోయిన్‌గా పూజా... భారీగానే


టాలీవుడ్‌లో సరైన ఆరంభాన్ని అందుకోలేకపోయిన పూజా హెగ్డే... ఆ తర్వాత హిట్ ట్రాక్ ఎక్కింది. ఇలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత 'అరవింద సమేత.. వీరరాఘవ' నుంచి వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో' వంటి విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ కారణంగానే రెమ్యూనరేషన్‌ను పెంచేసి భారీగా సంపాదిస్తోందీ సుందరాంగి.

ఇక్కడా అక్కడ ఆమెదే హవా అనేలా

ఇక్కడా అక్కడ ఆమెదే హవా అనేలా

పూజా హెగ్డే.. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇది ఎప్పుడో పూర్తైనా.. ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీనితో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఇప్పుడు 'ఆచార్య'తో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది.

అందులోనే ఉంటూ రచ్చ చేస్తుందిగా

అందులోనే ఉంటూ రచ్చ చేస్తుందిగా

చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత, కెరీర్ విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అందాచందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా ఎనలేని క్రేజ్‌ను అందుకుంటూ ఫాలోవర్లను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోయిన గోపీకమ్మ

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోయిన గోపీకమ్మ

తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ తన ఎద అందాలతో కనువిందు చేస్తోంది. ఇక, ఈ ఫొటోలు బ్లాక్ అండ్ వైట్‌గా ఉన్నప్పటికీ ఆమె గ్లామర్ ట్రీట్ మాత్రం ఆకట్టుకుంటోంది. దీంతో బుట్టబొమ్మ పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X