హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మైమరపించే నటనతో తెలుగు సినీ ప్రియులను అలరిస్తూ కొంత కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సాదాసీదాగా పరిచయం అయిన ఈ భామ.. ఆరంభంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, ఒక్కసారి హిట్ ట్రాక్ ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితే లేకుండా దూసుకుపోతోంది. తద్వారా తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంటూ హవాను చూపిస్తోంది. అలాగే, మిగిలిన భాషల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ ఫొటోను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన కెరీర్.. సక్సెస్ లేదు

అలా మొదలైన కెరీర్.. సక్సెస్ లేదు

మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే పూజా హెగ్డేకు ఆఫర్లు వెల్లువెత్తాయి. సరిగ్గా అప్పుడే 'మూగమూడి' అనే తమిళ చిత్రంతో ఆమె హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అనంతరం 'ఒక లైలా కోసం' అనే సినిమాలోనూ నటించింది. కానీ, ఈవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి.

హిట్ లేకున్నా బాలీవుడ్‌లో ఎంటర్

హిట్ లేకున్నా బాలీవుడ్‌లో ఎంటర్

కెరీర్ ఆరంభంలో పూజా హెగ్డే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ, ఆమెకు హిట్ మాత్రం దక్కలేదు. అయితేనే ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లు మాత్రం బాగా వచ్చాయి. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో హిందీ పరిశ్రమకు దూరమైంది.

మలుపు తిప్పేసిన ఎన్టీఆర్ సినిమా

మలుపు తిప్పేసిన ఎన్టీఆర్ సినిమా

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న పూజా హెగ్డేకు 'అరవింద సమేత.. వీరరాఘవ'తో మొట్టమొదటి బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ అయింది. అలాగే రెమ్యూనరేషన్‌నూ భారీగా పెంచేసింది.

ఫస్ట్ చాయిస్ పూజానే... అన్నింట్లో

ఫస్ట్ చాయిస్ పూజానే... అన్నింట్లో


ప్రస్తుతం పూజా హెగ్డే వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్', 'ఆచార్య' షూటింగ్‌లను కూడా కంప్లీట్ చేసేసింది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు హరీశ్ - పవన్ కలయికలో వచ్చే సినిమాతో పాటు త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రానున్న ప్రాజెక్టులోనూ నటిస్తూ దూసుకెళ్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

తీరిక లేని షెడ్యూల్‌తో బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేస్తోంది.

మాల్దీవుల్లో ఎంజాయ్.. అలాంటివే

మాల్దీవుల్లో ఎంజాయ్.. అలాంటివే

ఇన్ని రోజులూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన పూజా హెగ్డే.. ఇప్పుడు ఖాళీ సమయాన్ని ప్రస్తుతం మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. అక్కడకు ఒంటరిగానే వెళ్లిన ఈ భామ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. అలాగే, అక్కడ బికినీ ధరించి దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం తరచూ షేర్ చేస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

Recommended Video

Tollywood Top 10 Heroines List || Filmibeat Telugu
హాట్ ఫొటోను వదిలిన బుట్టబొమ్మ

హాట్ ఫొటోను వదిలిన బుట్టబొమ్మ

చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న పూజా హెగ్డే.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలను సైతం షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బుట్టబొమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె అండర్‌వేర్ కనిపించేలా ఫోజులిచ్చింది. దీంతో అందరూ ఇది చూసి షాక్ అవుతున్నారు. ఫలితంగా ఈ పిక్ వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X