twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాని వల్లే ఇడియట్‌లా మారాను.. బుల్లి నిక్కర్‌లో బుట్టబొమ్మ.. పూజా పోజులకు పోరగాళ్లు పరేషాన్

    |

    నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అని ఏ క్షణానా రాశారో కానీ.. అప్పటి నుంచి పూజా హెగ్డే ప్యాంట్ వేసుకోవడమే మానేసింది. వేసుకుంటే బుట్టబొమ్మలా ఒకే గౌనులాంటిది వేసుకుంటుంది. కాళ్ల అందాలను చూపిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు చేసే హల్చల్‌కు ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పూజా అందాలను చూడతరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాసేపటి క్రితం ఆమె షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటి కథెంటో ఓ సారి చూద్దాం.

    వరుస హిట్స్..

    వరుస హిట్స్..

    టాలీవుడ్‌లో ప్రస్తుతం పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది. ఏ చిత్రంలో నటించినా బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది. దీంతో పూజా లక్కీ హ్యాండ్, గోల్డెన్ గర్ల్‌గా మారింది. అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో ఇలా ప్రతీది బ్లాక్ బస్టర్ హిట్టే కొట్టేశాయి. అన్నింటికంటే అల వైకుంఠపురములో చిత్రం పూజాకు ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టింది.

    బుట్టబొమ్మగా ఫేమస్..

    బుట్టబొమ్మగా ఫేమస్..

    అల వైకుంఠపురములో చిత్రంలో పూజా అందాలకు ఫిదా కాని వారెవ్వరూ ఉండరు. ఆమె సౌందర్యానికి తగ్గట్టే నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు, బుట్టబొమ్మ వంటి పాటలు పుట్టుకొచ్చాయి. ఈ పాటలో పూజా అందాలు మరో లెవెల్‌లో ఉంటాయి. అందుకే పూజా హెగ్డే కాస్త బుట్టబొమ్మగా మారిపోయింది.

    లాక్‌డౌన్‌లో కొత్తగా..

    లాక్‌డౌన్‌లో కొత్తగా..

    ప్రపంచమంతా కరోనా ధాటికి విలవిల్లాడుతుంది. మన దేశంలోనూ కరోనా విజృంభిస్తూ ఉంటే, దాన్ని కట్టడి చేసేందుకు లాక్ డౌన్‌ను విధించారు. దీంతో అందరూ ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. అలా ఇంటికే పరిమితం కావడంతో పూజా హెగ్డే వంటింట్లోకి చేరింది. కొత్త కొత్త స్వీట్స్‌ను, పదార్థాలను వండటం నేర్చుకుంటూ బిజీగా ఉంటోంది.

    Recommended Video

    Akkineni Akhil Message To His Fans On His Birthday

    క్వారంటైన్ ఇడియట్‌లా మార్చేసింది..


    అయితే ఇలా క్వారంటైన్‌లోనే ఉండాల్సి రావడంతో పూజాకు కాస్త పిచ్చెక్కినట్టుంది. అదే విషయాన్ని చెబుతూ.. ఈ క్వారంటైన్ నన్ను ఇడియట్‌లా మార్చేసింది అంటూ బుల్లి నిక్కర్ వేసుకుని సెల్ఫీలకు పోజులిచ్చింది. పూజా అందాలు, పోజులు చూసిన పోరగాళ్లు పరేషాన్ అయిపోతోన్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

    English summary
    Pooja Hegde Hot Selfies In Quarantine. She Says That this Quarantine Made Her Like An Idiot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X