For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నితిన్‌ మూవీకి పూజా హెగ్డే భారీ రెమ్యూనరేషన్: వాళ్లతో సమానంగా.. టాలీవుడ్‌ చరిత్రలో నయా రికార్డు

  |

  చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఆరంభంలోనే అదరగొట్టిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ పట్టేసిందట. యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ కోసం పూజా హెగ్డే రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూడండి!

  అలా ఎంటరైన బ్యూటీ.. హిట్లు దక్కలేదు

  అలా ఎంటరైన బ్యూటీ.. హిట్లు దక్కలేదు

  మోడల్‌గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే పూజా హెగ్డే ఎంతో మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ‘మూగమూడి' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘ముకుంద'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘ఒక లైలా కోసం' అనే సినిమానూ చేసింది. ఇలా వరుసగా సినిమాలు చేసినా.. పూజా హెగ్డేకు మాత్రం విజయం దక్కలేదు.

  ఫుల్ ఫామ్‌లో పూజా.. క్రేజ్‌.. చార్జ్ కూడా

  ఫుల్ ఫామ్‌లో పూజా.. క్రేజ్‌.. చార్జ్ కూడా

  ఆరంభంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన పూజా హెగ్డే.. కొన్నేళ్లుగా ఫుల్ ఫామ్‌లో కనిపిస్తోంది. ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ' నుంచి వరుసగా ‘మహర్షి', ‘గద్దలకొండ గణేష్', ‘అల.. వైకుంఠపురములో' వంటి విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ ఎదిగిపోయింది. అదే సమయంలో భారీగా ఛార్జ్ చేస్తోంది. వీటితో పాటు క్రేజ్‌ను కూడా గణనీయంగా పెంచుకుందామె.

  అన్ని చోట్లా పూజానే.. హవా చూపిస్తోంది

  అన్ని చోట్లా పూజానే.. హవా చూపిస్తోంది

  పూజా హెగ్డే ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే అక్కినేని అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. దీనితో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్' షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు ‘ఆచార్య'తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తూ సత్తా చాటుతోంది.

  మరో తెలుగు మూవీకి పూజా పచ్చజెండా

  మరో తెలుగు మూవీకి పూజా పచ్చజెండా

  ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే.. ఇప్పుడు మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్న యూత్ స్టార్ నితిన్ త్వరలోనే మరో సినిమా చేయనున్నాడు. దీని కోసమే పూజా హెగ్డేను తీసుకున్నారని ఫిలిం నగర్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  ఆ సినిమాకు పూజా భారీ రెమ్యూనరేషన్

  ఆ సినిమాకు పూజా భారీ రెమ్యూనరేషన్

  సాధారణంగా తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్లకు స్టార్‌డమ్‌ను బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. మరీ ఎక్కువగా అంటే రెండు నుంచి రెండున్నర కోట్లు తీసుకుంటున్నారు. అయితే, నితిన్‌తో చేయబోయే సినిమా కోసం మాత్రం పూజా హెగ్డే ఏకంగా రూ. 3.50 కోట్లు చార్జ్ చేస్తుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా అయిపోయిందని టాక్.

  Allu Arjun యుట్యూబ్ లో, Mahesh Babu ట్విట్టర్ లో Thaggede Le || Filmibeat Telugu
  టాలీవుడ్‌లో బుట్టబొమ్మ సరికొత్త రికార్డు

  టాలీవుడ్‌లో బుట్టబొమ్మ సరికొత్త రికార్డు

  నితిన్‌తో చేయబోయే సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా రూ. 3.50 కోట్లు అందుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. ఎందుకంటే తెలుగులో ఇంత మొత్తం ఇప్పటి వరకూ ఏ హీరోయిన్ అందుకోలేదు. దీంతో బుట్టబొమ్మ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఇక, బాలీవుడ్‌లో కూడా చాలా తక్కువ మంది భామలు మాత్రమే ఈ రేంజ్‌లో తీసుకుంటున్న విషయం తెలిసిందే.

  English summary
  Tollywood Star Heroine Pooja Hegde Very Busy with Few Movies. Now She Green Signal to do a film with Nithiin. She will Took 3.5 crores Remuneration for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X