ఆ తప్పు మళ్లీ చేయను.. అందువల్లే తీవ్రంగా నష్టపోయా.. పూజా హెగ్డే
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన పూజా హెగ్డే ప్రస్తుత స్టార్ హీరోయిన్‌గా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే స్టార్ హోదా రావడానికి చాలా సమయమే తీసుకొన్నారు. అయితే తాను కెరీర్ ఆరంభంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి చాలా కాలం పట్టింది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకొన్నాను. అందుకే లేటుగా స్టార్ స్టేటస్‌ను సంపాదించుకోవడం జరిగింది అని పూజా హెగ్డే తాజాగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
నేను సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత స్టార్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకోవడానికి 5 ఏళ్లు పట్టింది. హిట్లు సొంత చేసుకోవడానికి నన్ను నేను మార్చుకోవాల్సి వచ్చింది. సరైన స్క్రిప్టులను ఎంచుకోవడంలో సరైన నిర్ణయాలు తీసుకొంటున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

కెరీర్ ఆరంభంలో నేను కొన్ని తప్పులు చేశాను. కేవలం డైరెక్టర్ల పేర్లు చూసి సినిమాలు ఒప్పుకొన్నాను. ఆ తర్వాత తెలిసిందేమిటంటే.. స్క్రిప్టులు ఎంచుకోవడం చాలా ముఖ్యమనే విషయాన్ని అర్దం చేసుకొన్నాను. ఇప్పుడు స్క్రిప్టులపై, పాత్రలపై చర్చించడానికి, తెలుసుకోవడానికి చాలా సమయం తీసుకొంటున్నాను అని పూజా హెగ్డే తెలిపారు.
ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం అయ్యాను. ఇంటి పట్టునే ఉంటూ తదుపరి ప్రాజెక్టులపై, వ్యక్తిగతంగా పరిణితి సాధించడానికి కొన్ని చర్యలు తీసుకొంటున్నాను. లాక్‌డౌన్ తర్వాత నేను నా ఫ్రెండ్స్ అందరిని వ్యక్తిగతం కలువాలని అనుకొంటున్నాను. షూటింగులను బ్యాలెన్స్ చూసుకొంటూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తాను అని పూజా చెప్పారు.


Click it and Unblock the Notifications











