మంచు కురిసే వేళలో.. అక్కడ పూజా హెగ్డే ఏం చేసిందంటే..?
ప్రస్తుతం తెలుగు నాట పూజా హెగ్డే హవా నడుస్తోంది. పూజా హెగ్డే కనిపిస్తే చాలు ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టేనన్న టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలుస్తున్నాయి. గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో చెలరేగిపోతోంది. ప్రస్తుతం పూజా చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ముకుందతో పరిచయం..
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా.. అందర్నీ ఆకట్టుకుంది. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు వచ్చినా.. బాలీవుడ్‌కు చెక్కేయడంతో ఈ సుందరికీ ఇక్కడ అవకాశాలు తగ్గాయి.

బాలీవుడ్‌లో దక్కని గుర్తింపు..
హృతిక్ రోషన్‌తో చేసిన మొహంజదారో చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పూజా హెగ్డేను అక్కడి జనాలు పట్టించుకోలేదు.అయితే మళ్లీ డీజే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ లక్కీ గాళ్ అనిపించుకుంది.
వరుసగా బ్లాక్ బస్టర్స్..
డీజే చిత్రం హిట్ అవ్వడం, అందాలు ఆరబోయడంతో పూజాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఇక వరుసగా ఆఫర్స్ రావడం, చేసిన ప్రతీ సినిమా హిట్ అవ్వడంతో బాలీవుడ్‌లోనూ క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం పూజా చేతిలో ప్రభాస్ 20వ చిత్రం, అఖిల్ బ్యాచ్‌లర్ చిత్రం ఉన్నాయి.
Recommended Video

మంచులో తడుస్తూ..
పూజా హెగ్డే నిన్నటి వరకు జార్జియాలో ప్రభాస్‌తో రొమాన్స్ చేసింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ నిన్నటి వరకు జార్జియాలోనే షూట్ చేసుకుని.. నేడు
హైద్రాబాద్‌కు తిరిగి వచ్చింది. పది డిగ్రీల చలిలోనూ షూటింగ్ చేశామని పేర్కొన్నాడు డైరెక్టర్. అయితే అక్కడి వాతావరణాన్ని పూజా బాగానే ఎంజాయ్ చేసినట్టు ఆమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే తెలుస్తోంది. మంచు కురిసే వేళలో అని పాట పాడుకుంటూ పరవశించిపోతోన్నట్లుంది కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











