ఆ విషయంలో సమంత కంటే పూజ హెగ్డే బెటర్.. ఫుల్ స్పీడ్‌లో ఉన్న బుట్టబొమ్మ
సమంత, పూజా హెగ్డేల మధ్య అసలు పోలికే అవసరం లేదు. ఎవరికి ఉండే క్రేజ్ వారికి ఉంటుంది. ఎవరి ఫాలోయింగ్ వారిది ఎవరి సినిమాలు వారివి. అయితే సమంత చాలా సీనియర్. పైగా సౌత్ సూపర్ స్టార్. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే.. పూజాహెగ్డే చాలా చిన్నది. అయితే పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో రైజింగ్ స్టార్. టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారితో ఆడిపాడుతోంది.
అసలు వీరిద్దరి మధ్య పోలిక ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ మధ్య పూజా హెగ్డే సమంతపై కామెంట్ చేయడం, ఆపై అకౌంట్ హ్యాక్ అయిందని నాటకాలు ఆడటం, ఈ విషయంలో చిన్మయి, డైరెక్టర్ నందినీ రెడ్డి, సమంతలు కలిసి సెటైర్స్ వేయడం ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆపై సమంత ప్రత్యక్షంగా సెటైర్స్ వేయడం, తనకు ట్రోలింగ్ అంటే ఇష్టమని, నెగెటివిటీయే తనకు బలమని చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతం ఓ విషయంలో మాత్రం సమంత కంటే పూజా హెగ్డేయే ముందుంది. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు పది మిలియన్ల సైన్యం వచ్చింది. అందుకు సమంత కూడా చాలా సంతోష పడింది. పది మిలియన్లకు గుర్తుగా పది చారిటీలకు ఏవేవో దానాలు కూడా చేసింది. అయితే పూజా హెగ్డేకు ప్రస్తుతం 11 మిలియన్ల అభిమాన గణం ఉంది. ఈ విషయాన్ని పూజా హెగ్డే చెబుతూ తెగ సంబరపడింది. అందరికీ థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది. అయితే సమంతకు ప్రస్తుతం 10.7మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











