'సినిమాలకూ విధిరాత ఉంటుంది.. అందుకే అలా..' రాధేశ్యామ్ మీద పూజా హెగ్డే ఆసక్తికర కామెంట్స్
ఇటీవల ప్రభాస్ -పూజా హెగ్డే 'రాధే శ్యామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు దెబ్బ కొడుతున్నాయి. ఇక ఈ సినిమాకు భారీ నష్టాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే 'రాధే శ్యామ్' ఫలితం మీద పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రార్ధన పాత్రలో
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీనే 'రాధే శ్యామ్'. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాలో జ్యోతిష్యుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే డాక్టర్ ప్రార్ధన పాత్రలో నటిస్తోంది.

ఇంటర్వ్యూలో ఓపెన్ అయినట్టు
ఇక భారీ స్థాయిలో ప్లాన్ చేసిన ఈ సినిమాలో ఈ ఏడాదిలో ఫస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా రిలీజ్ గా వచ్చింది. అయితే ఈ సినిమా మంచి అంచనాలు హిట్ సాంగ్స్ తో గట్టి బజ్ నడుమే విడుదల అయ్యింది కానీ మొదటి రోజు నుంచి కాస్త మిక్స్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ టాక్ పైనే ఈ సినిమా హీరోయిన్ పూజా హెగ్డే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయినట్టు సమాచారం.

కలెక్షన్లు పెద్దగా రావని
ఆమె ఏ ఇంటర్వ్యూలో చెప్పిందో తెలియదు కానీ విధిరాత నుంచి ఎవరూ తప్పించుకోలేరని జాతకాలు గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది పూజా హెగ్దే. మనుషులకే కాదు సినిమాలకూ విధిరాత ఉంటుందని నమ్ముతానని అంటోంది ఈ బుట్టబొమ్మ. కొన్ని సార్లు ఫర్వాలేదు అనుకున్న సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర బాగా కలెక్షన్లు రాబడతాయని... చాలా బాగుంది అనుకున్న సినిమాలకు కొన్నిసార్లు... కలెక్షన్లు పెద్దగా రావని చెప్పుకొచ్చింది.

ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని
ఇక అదే సమయంలో రాధేశ్యామ్ తన పెర్ఫార్మెన్స్ పట్ల సంతోషంగా ఉన్నట్లు చెప్పింది పూజ. "సినిమాలో నన్ను జనాలు చూసి ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని పూజా చెప్పుకొచ్చింది. ఇక రాధే శ్యామ్ ఫలితంపై ప్రభాస్ కూడా స్పందించాడని అంటున్నారు. ఎక్కడ స్పందించాడు అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ తన ఇమేజ్ తొలి మూడు రోజుల సినిమా వసూళ్లను, ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పుకొచ్చారు.

కలెక్షన్స్ విషయానికి వస్తే
ఇక రాధే శ్యామ్ కలెక్షన్స్ విషయానికి వస్తే 'రాధే శ్యామ్'కు మొదటి 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 24.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.73 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.23 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.26 కోట్లు, గుంటూరులో రూ. 4.40 కోట్లు, కృష్ణాలో రూ. 2.61 కోట్లు, నెల్లూరులో రూ. 2.10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 52.99 కోట్లు షేర్, రూ. 82.65 కోట్లు గ్రాస్ వచ్చిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











