Pooja Hegde.. ఆ దర్శకుడు అలా ఏడిపించాడు.. అలా కన్నీళ్లు పెట్టుకొన్నా.. పూజా హెగ్డే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి అందాల భామ పూజా హెగ్డే వెండి తెరపైన మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు. వీరిద్దరు నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. ఈ రాధేశ్యామ్ గురించిన విషయాలను బుట్ట బొమ్మ ఆసక్తికరంగా వెల్లడించారు. పూజా హెగ్డే చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

హిందీ, తెలుగులో డిఫరెంట్‌గా

హిందీ, తెలుగులో డిఫరెంట్‌గా

రాధే శ్యామ్ సినిమా కథ ఒకటే. కానీ హిందీ, తెలుగులో వేర్వేరుగా షూట్ చేశారు. హిందీలో ఉండే సీన్లు తెలుగులో మరో రకంగా ఉండేది. హిందీ ప్రేక్షకుల అభిరుచి ప్రకారం కొన్ని సీన్లు డిఫరెంట్‌గా చేశాం. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ ప్రకారం మరో రకంగా షూట్ చేశాం. ప్రతీ సీన్‌ను ఎంజాయ్ చేస్తూ నటించాను. ఇటలీ, జార్జియాలో మంచి కోవిడ్ పరిస్థితుల్లో సినిమా షూట్ చేశాం.

మేము ఇటలీలో షూట్ చేస్తున్న సమయంలో చాలా మంది ఫోన్ చేసి నా గురించి ఆందోళన చెందారు. అలాంటి డేంజరస్ పరిస్థితుల్లో రిస్క్ చేసి నటించాను. నా ప్రొడ్యూసర్ ఎప్పుడూ నా వల్ల నష్టపోకూడదని అనుకొన్నాను. అందుకే కోవిడ్ పరిస్థితుల్లో భయపడుతూనే నేను షూట్‌లో పాల్గొన్నాను అని పూజా హెగ్డే చెప్పారు.

ఎమోషనల్ సీన్లలో అలా..

ఎమోషనల్ సీన్లలో అలా..

రాధే శ్యామ్ సినిమా ఒకేసారి హిందీ, తెలుగులో షూట్ చేశారు. ఈ సినిమాలో చాలా ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. నేను పాత్రను పూర్తిగా అర్ధం చేసుకోవడం వల్ల నేను గ్లిజరిన్ పెట్టుకోకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. హిందీలో సీన్ షూట్ అయిన తర్వాత మళ్లీ తెలుగులో చేయాల్సి వచ్చేది. అలా ఒక్కో సీన్ కోసం రెండుసార్లు.. ఎక్కువ టేక్స్ తీసుకొంటే ఎక్కువ సార్లు ఏడిచే దానిని. దర్శకుడు రాధాకృష్ణ చాలా సార్లు ఏడిపించాడు. అదే నాకు ఈ సినిమాలో పెద్ద ఛాలెంజ్‌గా మారింది అని పూజా హెగ్డే తెలిపారు.

తెలుగు పాటలు వావ్ అనిపిస్తాయి

తెలుగు పాటలు వావ్ అనిపిస్తాయి

రాధే శ్యామ్ సినిమా కోసం హిందీ, తెలుగు భాషల్లో పాటలను కూడా వేర్వేరుగా షూట్ చేశాం. తెలుగులో లిరిక్స్ బాగుంటాయి. ఈ పాటల్లో రొమాన్స్ ఉంటుంది. నాకు తెలుగులో లిరిక్స్ బాగా నచ్చాయి. తెలుగు సాంగ్స్ వావ్ అనేలా ఉన్నాయి. తెలుగు పాటలు పీరియాడిక్ ఫీల్‌ను కలిగిస్తున్నది. తెలుగులో పోయేట్రి నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం యాక్టింగ్‌తో బిజీగా ఉన్నాను. అవకాశం వస్తే సింగర్‌గా మారుతాను అని పూజా హెగ్డే చెప్పారు.

 లవ్ స్టోరీలంటే చాలా ఇష్టం..

లవ్ స్టోరీలంటే చాలా ఇష్టం..

నాకు లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. నేను లవ్ స్టోరి సినిమాలు చూస్తూ పెరిగాను. లవ్ స్టోరీల్లో నటించడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తాను. రాధే శ్యామ్‌ను టైటానిక్ సినిమాతో పోల్చడం గర్వంగా ఉంది. అయితే టైటానిక్ సినిమాకు రాధే శ్యామ్ సినిమాకు ఎలాంటి పోలీకలు ఉండవు. కేవలం షిప్‌లో కొన్ని సీన్లు మాత్రమే ఉంటాయి. ఈ సినిమాలో నాది బ్యూటీఫుల్ రోల్. సినిమా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. పూర్తిగా ఫాంటసీతో సాగే పీరియాడిక్ సినిమా అని పూజా హెగ్డే తెలిపారు.

Recommended Video

Radhe Shyam లో Prabhas కి ఉండే వరమే .. ఆఖరికి శాపంలా మారుతుంది | Filmibeat Telugu
తెలుగు సినిమా ఇండస్ట్రీకే ప్రాధాన్యం

తెలుగు సినిమా ఇండస్ట్రీకే ప్రాధాన్యం

నేను చాలా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. విజయ్‌తో బీస్ట్ చేశాను. అయితే ప్యాన్ ఇండియా హీరోయిన్ అంటే నేను అంతగా ఇష్టపడను. అయితే ప్యాన్ ఇండియా హీరోయిన్ కాకుండా ప్యాన్ ఇండియా లాంగ్వేజ్‌లో చేస్తున్నాను. హిందీ, తమిళం కంటే.. నేను ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తాను.

హిందీ సినిమా షూటింగులో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. తెలుగు ఇండస్ట్రీ నాకు మంచి కెరీర్ ఇచ్చింది. ఫిలిం ఇండస్ట్రీలో నాకు తెలుగు సినిమాలు మంచి గుర్తింపు ఇచ్చాయి. అందుకే నా పూర్తి ప్రాధాన్యం తెలుగు సినిమాలకే. నంబర్ వన్ హీరోయిన్ అంటే నేను పెద్దగా పెట్టించుకోను అని పూజా హెగ్డే చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X