వాళ్లంతా ఫేక్.. వాళ్లను నమ్ముకొంటే గోవిందా.. పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్
సినీ పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అనేది చాలా కష్టం. అప్పటివరకు ఎంతో స్టార్డం అనుభవించినప్పటికీ ఒక్క రాత్రి లోనే లైఫ్ మారిపోయిన నటీనటులు ఎందరో.. ఇలానే ఓవర్ నైట్ లోనే అంతకు ముందు వరకు సరైన ఆదరణ లేని వారు కూడా హైలైట్ అవుతారు. కాగా ఇలాంటి పరిస్థితులు ఎక్కువ హీరోయిన్స్ విషయంలో కనిపిస్తూ ఉంటాయి.
మరి వీరిలో ఖచ్చితంగా వినిపించే పేరు పూజా హెగ్డే అని చెప్పవచ్చు. మరి పూజా హెగ్డే హీరోయిన్ గా తెలుగులో ఎంటర్ అయ్యిన కొన్నేళ్ళకే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని తాను తెచ్చేసుకుంది. ఇక అక్కడ నుంచి నాన్ స్టాప్ ఆఫర్స్ తో పూజా హెగ్డే తెలుగు యువతని ఒక ఊపు ఊపేసింది. మరి ఇలా కొన్నేళ్ల పాటుగా హవా చూపించిన పూజా హెగ్డేకి కూడా బ్యాడ్ టైం తప్పలేదు.

తెలుగు సహా హిందీ ఇంకా తమిళ భాషల్లో తనకి వరుస ప్లాప్ లు లేదా డిజాస్టర్స్ మాత్రమే వచ్చి పాన్ ఇండియా లెవెల్లో వెనుకబడిపోయింది. దీనితో కొన్నాళ్ల పాటుగా గ్యాప్ కూడా ఆమెకి వచ్చేసింది. పైగా ఓకే చేసిన సినిమాలు ఆల్రెడీ షూటింగ్ చేసిన వాటి నుంచి కూడా తీసేయడం అనేది మరింత షాకింగ్ గా మారింది. అయితే మళ్ళీ ఇపుడు సౌత్ లో పలు సినిమాలతో బిజీగా మారిన పూజా హెగ్డే చెప్పిన కొన్ని పచ్చి నిజాలు ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
తాజా ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని కామెంట్స్ మెయిన్ గా సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో కొందరికి సోషల్ మీడియాలో మిలియన్స్ లెక్కలో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన వారికి రియల్ మార్కెట్ లో అంత క్రేజ్ ఉండదు అని చెప్పుకొచ్చింది.
ఉదాహరణకి తనకి ఇన్స్టాగ్రామ్ లో 30 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉండొచ్చు అలా అని రేపు నా సినిమాకి అందరూ రారు అని పచ్చి నిజాన్ని ఒప్పుకుంది. అంతే కాకుండా ఇదే చాలా మందికి కూడా వర్తిస్తుంది అన్నట్టు చేసిన కామెంట్స్ చర్చకి దారి తీశాయి. మెయిన్ గా మన టాలీవుడ్ లో కొందరు హీరోలకి పూజా హెగ్డే కామెంట్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి.
ఇన్స్టాగ్రామ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోస్ కి కూడా 30 మిలియన్ మేర ఉన్నారు కానీ బయట తమ సినిమా ఓపెనింగ్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో రావు అని కొందరు అంటున్నారు. ఇక ఇదే పాయింట్ తో క్రికెటర్స్ పై కూడా వినిపిస్తున్నాయి. ఆన్లైన్ లో విరాట్ కోహ్లీకి వందల మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ బయట మాత్రం ఐపీఎల్ లోనే చూసుకున్నా ఆర్సీబీ చెన్నై మ్యాచ్ చూస్తే అందులో ధోని డామినేషన్ కనిపిస్తుంది.
కానీ ఆన్లైన్ లో మాత్రం కోహ్లీ కంటే ధోని ఫాలోవర్స్ చాలా తక్కువ.. కట్ చేస్తే ఆఫ్ లైన్ లో మాత్రం ధోని డామినేషన్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. సో ఇలా ఫాలోవర్స్ ని నమ్ముకుంటే బయట ఒరిగేది లేదని చెప్తుంది. దీనితో ఒక్క స్పీచ్ తో ఇన్ని పిట్టలు పడ్డాయి అన్నట్టుగా కామెంట్స్ నడుస్తున్నాయి.


Click it and Unblock the Notifications











