twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూజా హెగ్డే ప్లానింగ్ మామూలుగా లేదు.. ‘రాధేశ్యామ్’ సెట్‌లో ఇద్దరి బర్త్ డే సెలబ్రేషన్స్!!

    |

    ప్రస్తుతం అందరూ ఎదురుచూసేది ప్రభాస్ బర్త్ డే గురించే. ఆ రోజైనా రాధేశ్యామ్‌కు సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నారు డై హార్డ్ ఫ్యాన్స్. అయితే గత నెలలో డైరెక్డర్ రాధాకృష్ణ ఓ అప్డేడ్ ఇచ్చాడు. సెప్టెంబర్ రెండో వారంలో రాధేశ్యామ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోందని ట్వీట్ వేశాడు. అయితే రెండో వారం పోయి.. మూడో వారం కూడా పూర్తి కావాల్సి వస్తోంది. మరోసారి షెడ్యూల్ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.

    అయితే ఈ టీం మొత్తం ఇటలీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ టైమింగ్స్ ఫిక్స్ అయ్యాయని తెలుస్తోంది. తాజాగా పూజా హెగ్డే చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే షెడ్యూల్ ఎప్పుడు ఫిక్స్ అయి ఉంటుందనేది ఓ అంచనాకి వచ్చేయొచ్చు. అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోన్నట్టు ఫిక్స్ అయింది. పూజా హెగ్డే ట్వీట్ అది బయట పడింది.

     pooja Hegde is Looking forward to restart Radheshyam

    తాజాగా పూజా హెగ్డే చేసిన ట్వీట్‌తో రాధేశ్యామ్ అప్డేట్ వచ్చినట్టైంది. షూటింగ్‌కు కావాల్సిన డేట్స్‌ను యూనిట్ అడినట్టుంది. ఇక డేట్స్ ఇచ్చాక.. రాధాకృష్ణ అప్పుడెప్పుడో చేసిన ట్వీట్‌కు ఇప్పుడు రిప్లై ఇచ్చింది. మీ అందరితో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నాను.. ఇక సెట్‌లో ఇద్దరి బర్త్ డేలు సెలెబ్రేట్ చేయొచ్చు అని తెలిపింది. ఇద్దరి బర్త్ డేలు అంటే ప్రభాస్ (అక్టోబర్ 23), పూజా హెగ్డే (అక్టోబర్ 13) లది అని అర్థం అవుతోంది. అంటే ఈ షెడ్యూల్ అక్టోబర్ రెండు మూడు వారాల్లో ఉండబోతోందని తెలుస్తోంది.

    English summary
    pooja Hegde is Looking forward to restart Radheshyam, Can’t waitttt to resume shoot with all of you...🕰Grimacing face🕰 with two birthday’s on set too!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X