ఒకేసారి ముగ్గురు టాప్ హీరోలతో .. ఎన్టీఆర్ స్పీడ్ తట్టుకోలేకపోయా.. అంతా ఫ్లయిట్‌లోనే.. పూజా హెగ్డే

Recommended Video

Pooja Hedge Interesting Comments On Tollywood Offers || Filmibeat Telugu

టాలీవుడ్‌లో పూజా హెగ్డే తన హవాను కొనసాగిస్తున్నది. ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ అందాల భామ.. డీజేతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. దిల్ రాజు నిర్మించిన దువ్వాడ జగన్నాథం చిత్రంలో గరం గరంగా అందాలను వడ్డించిన ఈ బ్యూటీ టాలీవుడ్ అగ్రహీరోల కంట్లో పడింది. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ లాంటి అగ్రహీరోలతో సయ్యాటలాడుతున్నది. ఇక పూజా గ్లామర్ కేవలం దక్షిణాదికే పరిమితం కాలేదు. బాలీవుడ్‌లో కూడా భారీ చిత్రాల్లో నటిస్తున్నది. తాజాగా మహర్షి సినిమా ప్రమోషన్‌లో భాగంగా పూజా హెగ్డే మాట్లాడుతూ..

 ఒకేసారి ముగ్గురు టాప్ హీరోలతో

ఒకేసారి ముగ్గురు టాప్ హీరోలతో

డీజే తర్వాత నా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. అరవింద సమేతలో ఎన్టీఆర్‌తో నటించాను. ఆ షూటింగ్‌లో ఉండగానే మహర్షి చిత్రంలో మహేష్ బాబుతో నటించే ఆఫర్ వచ్చింది. మహర్షిలో నటిస్తుండగానే ప్రభాస్ పక్కన కనిపించే అవకాశాలు నన్ను తట్టాయి. కేవలం ఆరు నెలల్లోనే పరిస్థితి అంతా పాజిటివ్‌గా మారింది. అలా అవకాశాలు రావడం నిజంగా అదృష్టం అని పూజా హెడ్గే అన్నారు.

ఉదయం.. మధ్యాహ్నం, రాత్రి బిజీగా

ఉదయం.. మధ్యాహ్నం, రాత్రి బిజీగా

కొన్నిసార్లు నా షెడ్యూల్ అత్యంత బిజీగా మారిపోయింది. ఒకేరోజు ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్‌తో కలిసి నటించాను. ఒక రోజు ఉదయం 7 నుంచి అరవింద సమేత కోసం ఎన్టీఆర్‌తో, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు మహేష్ బాబుతో మహర్షి చిత్ర షూటింగ్‌లో, రాత్రి 9 నుంచి ఉదయం 2 గంటల వరకు ప్రభాస్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నాను. ఇలా ఏ హీరోయిన్‌కు ఇలాంటి అవకాశం దక్కదేమో అని పూజా హెగ్డే అన్నారు.

సొంతంగా జెట్ ఫ్లయిట్‌లో

సొంతంగా జెట్ ఫ్లయిట్‌లో

తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌తో నటించే సమయంలోనే హిందీలో హౌస్‌ఫుల్ 3 సినిమా కమిట్ అయ్యాను. ఆ సమయంలో రాజస్థాన్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్‌లో పాల్గొనడానికి సొంతంగా జెట్ ఫ్లయిట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఉదయం టాలీవుడ్‌లో, రాత్రి హిందీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ స్పీడ్ తట్టుకోలేకపోయాను

ఎన్టీఆర్ స్పీడ్ తట్టుకోలేకపోయాను

అరవింద సమేతలో నటించేటప్పుడు ఎన్టీఆర్ స్పీడ్‌ను తట్టుకోలేకపోయాను. ఆయనతోపాటు సమానంగా డైలాగ్‌లు చెప్పడానికి చాలా కష్టపడ్డాను. ఎన్టీఆర్ డైలాగ్స్ చెబుతుంటే నాలాంటి వాళ్లకు గుండెల్లో దడలా ఉంటుంది. అందుకే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను డైలాగ్స్ ముందే ఇవ్వమని బతిమాలుకొన్నాను. ఎన్టీఆర్‌తో సీన్ చేయాలంటే ముందే ప్రిపేర్ కావడం చాలా అవసరం పూజా హెగ్డే అన్నారు.

నేను భాష నేర్చుకోవడానికి

నేను భాష నేర్చుకోవడానికి

తెలుగు భాషను పూర్తిగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఏ పాత్రలోనైనా రాణించాలంటే భాష మీద పట్టు ఉండాలి. టాలీవుడ్‌లో స్థిరపడాలంటే భాషపై అవగాహన పెంచుకోవాలనే విషయం అర్థమైంది. అందుకే ప్రత్యేకంగా తెలుగు నేర్చుకోవడానికి కష్టపడుతున్నాను అని పూజాహెగ్డే అన్నారు.

 మహర్షితో టాప్ రేంజ్‌లో

మహర్షితో టాప్ రేంజ్‌లో

టాలీవుడ్‌లో ఒక లైలా కోసం చిత్రంలో నాగచైతన్యతో కలిసి నటించిన పూజా హెగ్డే ఆ తర్వాత ముకుంద చిత్రంలో కనిపించింది. అయితే ఈ రెండు చిత్రాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ దువ్వాడ జగన్నాథం తర్వాత పూజా హెగ్డే టాప్ హీరోయిన్‌గా మారింది. ఆమె నటించిన మహర్షి చిత్రం మే 9వ తేదీన రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X