Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Priyanka Chopra పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక చోప్రా.. బేబీ ఫోటో వైరల్.. పూజాహెగ్డే విషెస్
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా, నిక్ జోన్ జీవితంలో మధురమైన క్షణాలు చోటుచేసుకొన్నాయి. ప్రియాంక, నిక్ దంపతులు తొలి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాలను తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. శనివారం నిక్, ప్రియాంక సంయుక్తంగా తమ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి వెల్లడించారు. అయితే ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా జరగడంతో సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అయితే మాతృత్వపు అనుభూతులను పొందుతున్న ప్రియాంకకు సహచర నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే...

హింట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా తల్లి
ప్రియాంక చోప్రా గురించి ఓ శుభవార్త వినబోతున్నారు అంటూ తల్లి మధు చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలోనే ప్రియాంక జీవితంలో కీలకమైన సంఘటన చోటుచేసుకోబోతున్నది అంటూ హింట్ ఇచ్చారు. భగవంతుడి దయవల్ల జరుగాల్సిన రోజు త్వరలోనే ఉంది అంటూ మధు చోప్రా చెప్పుకొచ్చారు.

సంతానం గురించి చెప్పడానికి ఇష్టపడని ప్రియాంక చోప్రా
అయితే నిక్ జోనస్‌తో ప్రేమలో పడిన ప్రియాంక చోప్రా 2018, డిసెంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకొన్నారు. జోధ్‌పూర్‌లోని ఉమేద్ భవన్ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్టియన్ మతాచారాల ప్రకారం వివాహం జరిగినప్పటి నుంచి పలు మార్లు సంతానం గురించిన ప్రశ్నలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇద్దరం బిజీగా ఉన్నాం. ఆ ప్రాక్టీస్ చేయడం లేదంటూ తన సంతానం గురించి ప్రశ్నలను దాటవేస్తూ వచ్చారు. అయితే ఊహించని విధంగా ప్రపంచానికి తాను తల్లినైనట్టు జనవరి 21వ తేదీన ప్రకటించారు.

మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు
ప్రియాంక చోప్రా తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో.. సరోగసి ద్వారా మేము ఓ బిడ్డకు జన్మనిచ్చామని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మా ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుకొంటున్నాం. ప్రస్తుతం మా ఫ్యామిలీ వ్యవహారాలపై ఫోకస్ చేస్తున్నాం. థ్యాంక్యూ సో మచ్ అంటూ ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నది. ఇదే పోస్టును నిక్ కూడా పోస్టు చేయడం గమనార్హం.

ప్రియాంకకు పూజా హెగ్డే, కత్రినా కైఫ్ కంగ్రాట్స్
ప్రియాంక దంపతులకు సినీ తారలు, స్నేహితులు శుభాకాంక్షలు అందించిన వారిలో లారా దత్తా, పూజా హెగ్డే, కత్రినా కైఫ్, హాలీవుడ్ నటులు కాల్ పెన్, మిని మాథుర్, నేహా దూపియా, ఫర్హాన్ అఖ్తర్ తదితరులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందించారు.
పూజా హెగ్డే శుభాకాంక్షలు అందిస్తూ.. కంగ్రాట్స్, మీకు హృదయపూర్వకమైన ప్రేమను వ్యక్తం చేస్తున్నాను అని చెప్పారు. అలాగే లారా దత్తా కంగ్రాట్స్ అంటూ పోస్టు పెట్టారు. ఇంతకంటే గొప్ప వార్త ఏదైనా వార్త ఉందా? అంటూ నేహ దూపియ చెప్పారు.

ఫ్యాన్ పేజ్‌లో ఫోటో వైరల్
అయితే ప్రియాంక చోప్రా సర్రోగసి ద్వారా బిడ్డను కన్నామంటూ చెప్పిన వెంటనే ఆమె ఫ్యాన్ పేజీలో నిక్, ప్రియాంక ఒడిలో ఓ బాబు ఉన్న ఫోటో వైరల్ అయింది. ప్రియాంక తల్లి అయిందంటే నమ్మలేకపోతున్నాం. భగవంతుడా ఇది నిజమే అనే వార్తను ఊహించుకోలేకపోతున్నాం అంటూ ఓ మెసేజ్ పెట్టి ఫోటోను షేర్ చేశారు.

ఆ ఫోటో గురించి నెటిజన్ల కామెంట్స్
అయితే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ చేతిలో ఉన్న బాబు ఫోటో చాలా పాతది. గతంలో వారిద్దరి ఫోటోను అభిమానులు ఈ సందర్భంగా షేర్ చేస్తున్నారు. ఇంకా ప్రియాంక చోప్రా తన బిడ్డ ఫోటోను షేర్ చేయలేదు. ఇలాంటి ఫోటోలను నమ్మకండి అంటూ అభిమానులు సూచిస్తున్నారు.