Pooja Hegde: బికినీలో ఉన్న సంగతి మర్చిపోయిందా.. ఈసారి అంతకుమించి అనేలా బుట్టబొమ్మ సెక్సీ లుక్స్

టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే వరుస బాక్సాఫీస్ హిట్స్ తో సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కెరీర్ మొదట్లో కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత ఈ బ్యూటీ ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు అనే కామెంట్స్ అయితే వచ్చాయి. అయినప్పటికీ పూజా హెగ్డే అయితే ఏ మాత్రం నిరాశ చెందకుండా తన టాలెంట్ తో మంచి అవకాశాలను అందుకుంది. ఇక ఈ బ్యూటీకి ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అయితే వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో కూడా తన ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల బికినీలో మరొక హాట్ స్టిల్ ను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది.

తొందరపడకుండా..

తొందరపడకుండా..

ముంబైకి చెందిన పూజా హెగ్డే కాలేజీ సమయంలోనే ఫ్యాషన్ షోలలో అలాగే డాన్స్ కాంపిటీషన్స్ లో రెగ్యులర్ గా పాల్గొంటూ ఉండేది. ఇక మెల్లగా మోడలింగ్ ప్రపంచం వైపు అడుగుపెట్టిన ఆమె అతి తక్కువ కాలంలోనే పలు బ్రాండ్ ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన యాడ్స్ లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక పలు రకాల యాడ్స్ చేసిన తర్వాత అమ్మడికి సౌత్ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంది.

వరుసగా ఫెయిల్యూర్స్

వరుసగా ఫెయిల్యూర్స్

తెలుగులో 2014 లో ఒక లైలా కోసం సినిమా తో వెండితెరకు పరిచయం అయిన బుట్టబొమ్మ ఆ తర్వాత ముకుందా సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఆ తర్వాత రెండేళ్లకు బాలీవుడ్ లో నటించే అవకాశం దక్కించుకుంది మొహంజదారో సినిమా అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలవడంతో అమ్మడికి ఒక్కసారిగా వచ్చిన ఆఫర్స్ కూడా మళ్ళీ వెనక్కి వెళ్లిపోయాయి.

ఆ సినిమా తరువాత

ఆ సినిమా తరువాత

ఎప్పుడైతే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బికినీలో కనిపించిందో అప్పటినుంచి ఆమె లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత అరవింద సమేత, మహర్షి గద్దలకొండ గణేష్ సినిమాలు కూడా మంచి క్రేజ్ ను అందించాయి. మధ్యలో రంగస్థలం సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ తో మంచి గుర్తింపు పొందింది. ఇక అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలువగా ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుంది.

 మరోసారి హాట్ బికినీలో

మరోసారి హాట్ బికినీలో


ఇక వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుంటున్న తరుణంలో పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానుల సంఖ్యను మరింత పెంచుకుంటోంది. ఈ బ్యూటీ ఇటీవల వరుస ఫోటోలతో అందరికీ షాక్ ఇస్తోంది అనే చెప్పాలి. ఒక బీచ్ లో పూజ అయితే మైమరచిపోయి బికినీలో కనిపించింది. ఆమె బికినీలో ఉన్న సంగతి మర్చిపోయిందా అనే విధంగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పూజా హెగ్డే బికినీ లో మాత్రం సెక్సీ లుక్స్ తో చాలా క్యూట్ గా ఉంది అని కూడా మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

Recommended Video

Anand Devarakonda About Pushpaka Vimanam Movie Success
చేతిలో అన్నీ పెద్ద సినిమాలే..

చేతిలో అన్నీ పెద్ద సినిమాలే..


ఇక ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. రణ్ వీర్ తో పాటు సల్మాన్ ఖాన్ తో కూడా సినిమాలు చేయబోతోంది. ఇక తెలుగులో అయితే రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. తమిళంలో విజయ్ తో బీస్ట్ సినిమా చేస్తోంది. ఈ సినిమాలన్నీ కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటి రీజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X