For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి బికినీలో షాక్ ఇచ్చిన పూజా హెగ్డే.. టాప్ వ్యూలో హార్ట్ బీట్ పెరిగేలా హాట్ లుక్

  |

  ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్ గా టాప్ లిస్ట్ లో కొనసాగుతున్న బ్యూటీ పూజా హెగ్డే. గత కొంతకాలంగా అమ్మడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక విధంగా కెరీర్ కు అయితే హెల్ప్ అవుతోంది. వీలైనంత వరకు అమ్మడు ఎక్కువగా పెద్ద సినిమాల్లో అవకశాలు అందుకోవాడనికి ప్రయత్నాలు చేస్తోంది.

  ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ఫాలోవర్స్ కు ఊహించని విధంగా హాట్ లుక్స్ తో షాక్ ఇస్తోంది. ఇక రీసెంట్ గా ఒక బికినీలో ఇచ్చిన స్టిల్ ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారుతోంది. గతంలో ఇదే తరహాలో చాలాసార్లు స్టిల్స్ ఇచ్చినప్పటికీ ఈ లుక్ చాలా కొత్తగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

  Esther Anil : పరువాల ఆరబోతతో రెచ్చిపోయిన వెంకటేష్ చిన్న కూతురు... వామ్మో నెవర్ బిఫోర్ అంతే!

  మొదట్లో భారీ దెబ్బలు

  మొదట్లో భారీ దెబ్బలు

  పూజా హెగ్డే కెరీర్ మొదలు పెట్టినప్పుడు అనుకున్నంత స్థాయిలో అయితే విజయాలు దక్కలేదు. మల్టీ నేషనల్ బ్రాండ్స్ కు సంబంధించిన యాడ్స్ లో కనిపించిన అనంతరం ఈ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కించుకుంది. అయితే ఆ సినిమాలు మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో చేసిన ఒక సినిమా కూడా అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది.

  Actor Nani Biography వివాదాలను హుందా గా ఎదుర్కున్న స్టార్!! || Filmibeat Telugu
  ఆ సినిమాతో యూ టర్న్

  ఆ సినిమాతో యూ టర్న్

  ప్లాప్స్ ఎన్ని వస్తున్నా కూడా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వీలైనంత వరకు వచ్చిన అవకాశాలతోనే నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేసింది. మరోవైపు పోటీగా ఎంత మంది ఉన్నా కూడా తన గ్లామర్ ప్రెజెంటేషన్ తోనే గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఎప్పుడైతే అల్లు అర్జున్ డీజే సినిమాతో హిట్టు కొట్టిందో అప్పటినుంచి అమ్మడి తలరాత మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ వంటి అగ్ర హీరోలతో నటించే అవకాశం అందుకుంది.

  హాట్ బికినీ లుక్

  హాట్ బికినీ లుక్

  వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్స్ అందుతుండటంతో అమ్మడికి బాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఎన్ని ఆఫర్స్ వస్తున్నా కూడా పూజ సోషల్ మీడియాలో తన గ్లామర్ ను మాత్రం అస్సలు తగ్గించడం లేదు.

  ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లుని మరింత ఆకట్టుకుంటోంది. ఇటీవల మరోసారి హాట్ బికినీతో కనిపించి షాక్ ఇచ్చింది. టాప్ వ్యూలో కెమెరాకు పోజులు ఇచ్చిన బుట్ట బొమ్మ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది.

  చేతిలో బడా సినిమాలు..

  చేతిలో బడా సినిమాలు..

  అయితే బుట్టబొమ్మ ఏలాంటి పోస్ట్ చేసినా కూడా అది నిమిషాల్లో ఇంటర్నెట్ లో ట్రెండ్ అవ్వాల్సిందే. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సినిమాలతో బిజీ గా కనిపిస్తోంది. తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొదటి సారి దళపతి విజయ్ తో కూడా నటిస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తో కూడా ఒక అవకాశం అందుకుంది.. మరి ఆ సినిమాలతో ఏ స్థాయిలో క్రేజ్ ను పెంచుకుంటుందో చూడాలి

  English summary
  Pooja hegde latest hot look viral in internet world
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X